ఫేస్బుక్-జియో ఉమ్మడి టార్గెట్ అమెజాన్, దీని వెనుక ఇంత ప్లాన్ ఉందా…?

-

ఫేస్బుక్, రిలయన్స్ జియో మధ్య భారీ ఒప్పందం జరిగిన సంగతి తెలిసిందే. దాదాపు పది శాతం షేర్ ని ఫేస్బుక్ సంస్థ కొనుగోలు చేసింది. దీని ద్వారా రిలయన్స్ జియో లో అతిపెద్ద పెట్టుబడి పెట్టిన మైనార్టీ షేర్ హోల్డర్ గా ఫేస్బుక్ నిలిచింది. మరి వీరు ఈ స్థాయిలో ఒప్పందం చేసుకోవడానికి ప్రధాన కారణం ఏంటీ అనేది చూస్తే… వీరి మధ్య ఈ ఒప్పందం జరగడానికి ఆన్లైన్ మార్కెట్ అని సమాచారం.

భారత్ లో అమెజాన్, ఫ్లిప్ కార్ట్ సంస్థలను లక్ష్యంగా చేసుకోవడానికి గాను వీళ్ళు ఈ ఒప్పందం చేసుకున్నారని ప్రధాన టార్గెట్ అమెజాన్ అని సమాచారం. అమెజాన్ సీఈఓ కి చెందిన వాషింగ్టన్ పోస్ట్ కాశ్మీర్ సహా భారత్ అంశాల మీద ఎక్కువగా వ్యాఖ్యలు చేసింది. దీనితో అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ మీద ఆగ్రహంగా ఉంది కేంద్రం. ఈ తరుణంలో ఆ సంస్థను దేశంలో దెబ్బ కొట్టడానికి ఈ ప్లాన్ చేసినట్టు సమాచారం.

లాక్ డౌన్ లో ఈ కామర్స్ సంస్థలను అనుమతి ఇస్తారని అందరూ భావించారు. కాని ఆపేశారు… ముందుగా అమెజాన్ అన్ని సిద్దం చేసుకుంది కూడా. అయితే లాక్ డౌన్ తర్వాత రిలయన్స్ జియో, ఫేస్బుక్ కలిసి జియో ఫేస్ అనే ఒక ఈ కామర్స్ సంస్థను స్థాపించే అవకాశం ఉందని, అమెజాన్ కంటే భారీగా ఈ వ్యాపారం చెయ్యాలని రెండు సంస్థలు భావిస్తున్నట్టు సమాచారం. ముందు 10 రాష్ట్రాల్లో దీన్ని మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నారట.

Read more RELATED
Recommended to you

Latest news