ఏపీలో కరోనా విలయ తాండవం..ఒక్కరోజే 13,474 కేసులు

ఏపీలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తూనే ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కరోనా మహమ్మారి కేసులు పెరిగిపోతున్నాయి. గతంలో వెయ్యికి లోపు కరోనా కేసులు నమోదు కాగా.. ఇప్పుడు 13 వేలకు తగ్గకుండా కేసులు పెరిగి పోతున్నాయి. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం… ఏపీ వ్యాప్తంగా గడిచిన 24 గంటల లో కొత్తగా 13474 కరోనా కేసులు నమోదు అయ్యాయి.

ap carona
ap carona

దీంతో ఆంధ్ర ప్రదేశ్‌ లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2236047 కి పెరిగింది.ఒక్క రోజు వ్యవధిలో కోవిడ్ వల్ల విశాఖపట్నం లో ముగ్గురు, అనం తపురం లో ఇద్దరు, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం మరియు విజయనగరం లలో ఒక్కొ క్క రు చొప్పు న మరణిం చారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 14579 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 109493 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 10,290 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 41,771 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 3,23,25,140 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 2111975 లక్షలకు చేరింది.