గత కొన్ని రోజుల నుంచి..సినిమా టికెట్ల వ్యవహారంపై టాలీవుడ్,జగన్ సర్కార్ మధ్య వివాదం తలెత్తుతున్న సంగతి తెలిసిందే. సరైన పత్రాలు లేవంటూ.. చాలా థియేటర్లను సీజ్ చేసింది ఏపీ సర్కార్. అయితే.. థియేటర్లను సీజ్ చేసే అధికారులు తహసీల్దార్లకు కూడా ఇచ్చింది సర్కార్. అయితే… దీనిపై తాజాగా ఏపీ హై కోర్టు సీరియస్ అయింది. సినిమా థియేటర్ కు తాళం వేసే అధికారం తహసీల్దారుకు ఎక్కడిదని.. ఏపీ హై కోర్టు సీరియస్ అయింది.
దీనిపై వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లా.. సోంపేటలోని శ్రీనివాస మహల్ ను నిబంధనలను విరుద్దంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ.. తహసీల్దార్ మూసివేయించి.. తాళం వేశారు. దీంతో థియేటర్ మేనేజింగ్ పార్టనర్ ఎస్. శంకర రావు హై కోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టులో వాదానలు జరిగాయి.
ప్రభుత్వం తరఫు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ టెక్కలి సబ్ కలెక్టర్ ఆదేశాల మేరకు.. తహసీల్దార్ వ్యవహరించారని చెప్పారు. ప్రభుత్వ వాదనలను తోసిపుచ్చిన హైకోర్టు.. థియేటర్ ను సీజ్ చేసే అధికారం తహసీల్దార్ కు లేదని పేర్కొంది. ఈ అధికారం కేవలం జాయింట్ కలెక్టర్ చెప్పిన వ్యక్తికి మాత్రం ఉంటుందని పేర్కొంది. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరుగుతుందని వెల్లడించింది ఏపీ హై కోర్టు.