కర్ణాట‌కం : బీజేపీ వ్యూహంలో విద్యార్థులే పావులు!

-

పొరుగు రాష్ట్రం క‌ర్ణాట‌క‌లో మతం పేరిట సంబంధిత వ‌స్త్ర ధార‌ణ పేరిట వివాదాలు నెల‌కొంటున్న త‌రుణాన అటు రెండు జాతీయ పార్టీలు అప్ర‌మ‌త్త‌మ‌యి త‌మదైన రాజ‌కీయం ఒక‌టి నెర‌పుతున్నాయి. క‌ర్ణాట‌క‌లో అధికారంలో ఉన్న బీజేపీ రేపిన వివాదానికి ఇప్పుడు జాతీయ స్థాయిలో గుర్తింపు రావ‌డం, సీన్లోకి క‌శ్మీరు పార్టీలు కూడా ఎంట‌ర్ అవ్వ‌డంతో కాషాయ ద‌ళం త‌మ గొంతు మ‌రికొంత పెంచి వినిపిస్తోంది. ఇంత‌కూ ఏమా వివాదం? ఆ వివ‌రం ఈ క‌థ‌నంలో..

క‌ర్ణాట‌క‌లో కొత్త వివాదం ఒక‌టి రాజుకుంది. ముస్లిం విద్యార్థినులు హిజాబ్ (స్కార్ఫ్‌) వేసుకుని రాకూడ‌ద‌న్న నిషేధాజ్ఞ ఒక‌టి వినిపిస్తుంది. దీంతో కాంగ్రెస్ పార్టీ సీన్ లోకి వ‌చ్చి విద్యార్థినుల ప‌క్షాన మాట్లాడుతోంది. కానీ బీజేపీ మాత్రం పాఠ‌శాల ప్రాంగ‌ణాల్లో అంతా ఒక్క‌టేన‌ని క‌నుక విద్యార్థినులు హిజాబ్ వేసుకుని రాకూడ‌ద‌ని ఖ‌రాఖండీ చెబుతోంది. ఇటీవ‌ల ఓ విద్యాసంస్థ‌లో హిజాబ్ వేసుకుని వ‌చ్చార‌ని కొంద‌రు విద్యార్థినులను అక్క‌డి నిర్వాహ‌కులు అడ్డుకున్నారు.

దీంతో వాళ్లంతా నిర‌స‌న‌కు దిగినా కూడా ఫ‌లితం లేక‌పోయింది. క‌ళాశాల‌లో చేరిన‌ప్పుడే త‌మ‌కు ఈ విష‌యాలు చెప్పి ఉండాల్సింద‌ని మండి ప‌డుతూ పాపం ఆ చిన్నారులు చేసేది లేక నిరాశ‌తో త‌ర‌గ‌తుల‌కు హాజ‌రు కాకుండానే వెనుదిరిగారు. అప్ప‌టి నుంచి ఈ వివాదానికి కాంగ్రెస్ తోడ‌యింది. క‌శ్మీరీ ముస్లిం పార్టీలు కూడా తోడ‌య్యాయి. ఫ‌రుక్ అబ్దుల్లా లాంటి వారు సామాజిక మాధ్య‌మాల్లో మండిపడుతున్నారు. కానీ బీజేపీ మాత్రం వివాదానికి విలున్నంత వ‌ర‌కూ మ‌తం రంగు పుల‌మాల‌నే చూస్తోంది.

క‌ర్ణాట‌క‌లోని ఉడిపిలో రేగిన తాజా వివాదానికి ఇవాళ కొన‌సాగింపుగా అదే ప్రాంతానికి కొంద‌రు విద్యార్థులు త‌ల‌పాగా చుట్టుకుని హిందూ సంప్ర‌దాయం అనుసారం విద్యాసంస్థ‌ల‌కు వ‌చ్చారు. కాషాష రంగులో ఉన్న ఈ సంప్ర‌దాయ ప‌గిడీని ధ‌రించి విద్యార్థులు ఎంత‌గానో ఆక‌ట్టుకున్నారు. దీంతో వివాదం మాటెలా ఉన్నా సంస్కృతికి సంబంధించి కాస్త‌యినా వీళ్ల‌కు తెలిసి వ‌స్తుందన్న ఆశాభావం ఒక‌టి ఇంకొంద‌రి నుంచి వ్య‌క్తం అవుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version