తనను ఎలాగైనా ఇబ్బంది పెట్టాలనే రేవంత్ రెడ్డి ఇదంతా చేస్తున్నారని, అదే ముఖ్యమంత్రి లక్ష్యమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ ఆరోపించారు. సోమవారం ఏసీబీ కార్యాలయానికి వెళ్లి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఈ డ్రామా అంతా జరుగుతోందని కేటీఆర్ స్పష్టంచేశారు.
తాను లాయర్లను తెచ్చుకుంటే వాళ్లకు ఎందుకు అంత భయమని ప్రశ్నించారు. ఒకవేళ తన వెంట లాయర్లే లేకపోతే.. తాను ఇవ్వని స్టేట్‌మెంట్‌ను ఇచ్చినట్లుగా లీకులిచ్చి ప్రచారం చేసుకుంటారని మాజీ మంత్రి ఆరోపించారు. రాష్ట్ర పోలీసులపై తనకు నమ్మకం లేదని.. అందుకే తన వెంట విచారణకు లాయర్లను అనుతించాలని ఏసీబీ అధికారులను కోరినట్లు కేటీఆర్ వెల్లడించారు.