ప్రముఖ గేయ రచయిత సిరి వెన్నెల సీతారామా శాస్త్రి ఆకస్మికంగా మరణించిన విషయం తెలిసిందే. ఈ రోజు సిరి వెన్నెల సీతారామా శాస్త్రి అంత్య క్రియలు మహా ప్రస్థానం లో నిర్వహించనున్నారు. అయితే సిరి వెన్నెల సీతారామా శాస్త్రి మరణం పై హీరో సాయి కుమార్ స్పందించాడు. తమ మధ్య స్నేహం సిరివెన్నెల సినిమా తోనే మొదలైందని అన్నారు. ఆ సినిమా కు తానే డబ్బింగ్ చెప్పానని గుర్తు చేశారు. ప్రతి సందర్భం లో సిరి వెన్నెల తనను ఆశీర్వాధించాడని తెలిపారు.
అలాగే సిరి వెన్నెల ప్రతి పాట కూడా ఆణిముత్యం లా ఉంటాయని అన్నారు. తెలుగు సాహిత్యానికి పట్టాభిషేకం చేసిన వ్యక్తి సిరివెన్నెల అని అన్నారు. అలాగే రామ్ చరణ్ ఎవడూ సినిమా లో సిరి వెన్నెల కుమారుడి తో నటించానని తెలిపాడు. ఆ సినిమా లో తనను విలన్ పాత్ర లో సిరి వెన్నెల చూసి అభినందించాడని అన్నారు. సిరి వెన్నెల లేరు అంటే సాహిత్యం చచ్చిపోయినట్టే అని అన్నారు. సాహిత్య రంగం లో ఆయన లోటు ను ఎవరూ భర్తీ చేయలేరని అన్నారు.