అతడి బౌలింగ్లో అంత ఈజీ ఏం కాదు : పడిక్కల్

ఐపీఎల్ సీజన్ లో ఒక్కసారిగా ఎగసిపడిన కెరటంలా గా తెర మీదికి వచ్చి ఐపీఎల్ సూపర్ స్టార్ గా మారిపోయాడు దేవదత్ పడిక్కల్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు లో ఎంతో స్టార్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ ఎవరికీ సాధ్యం కాని విధంగా మొదటి ఐపీఎల్ సీజన్ లోనే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించి ఐపీఎల్లో ఎమర్జింగ్ ప్లేయర్స్ అవార్డును కూడా అందుకున్నాడు, అయితే ఇటీవలే రషీద్ ఖాన్ బౌలింగ్ గురించి దేవదత్ పడిక్కల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఐపీఎల్ సీజన్ లో ఫేసర్లు ఎదుర్కోవడం అంతగా కష్టతరం అనిపించలేదు అంటూ చెప్పుకొచ్చిన యువ బ్యాట్స్మెన్.. రషీద్ ఖాన్ బౌలింగ్ ఎదుర్కొనేటప్పుడు మాత్రం సవాల్ గా అనిపించింది అంటూ చెప్పుకొచ్చాడు. మంచి ఫేస్ తో కూడిన వైవిధ్యభరితమైన బంతులను రషీద్ వేస్టు ఉంటారని ప్రతి బంతి కూడా ఎంతో కొత్తగా అనిపిస్తూ ఉంటుంది అంటూ చెప్పుకొచ్చాడు. అందుకే అతని బౌలింగ్లో భారీ షాట్లు ఆడటం అంటే అంత సులువైనది కాదు అంటూ చెప్పుకొచ్చాడు.