సాధారణంగా ఎవరైనా తప్పు చేశామని అంగీకరిస్తే కోర్టులో ఆ వ్యక్తికి తప్పనిసరిగా శిక్ష పడుతుంది. దోషి అని తేలితే కోర్టు తప్పనిసరిగా నేరాన్ని బట్టి శిక్ష వేస్తుంది. అయితే ఒక వ్యక్తి తప్పు చేసినట్టు అంగీకరించినా కోర్టు ఆ వ్యక్తికి మాత్రం శిక్ష విధించలేదు. కోర్టులో సాక్ష్యాధారాలు సైతం అతనికి వ్యతిరేకంగా ఉన్నా శిక్షించడానికి కోర్టు అంగీకరించలేదు. కోర్టు ఆ వ్యక్తికి శిక్ష విధించకపోవడానికి ప్రత్యేకమైన కారణమే ఉంది.
అలా అని చెప్పి శిక్ష విధించకపోతే కోర్టుకే చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. దోషి కూర్చున్న చోటు నుంచి కదలలేని విధంగా ఉండటంతో అతనికి కొన్ని రోజుల తరువాత ఎలాంటి శిక్ష విధించాలనే విషయాన్ని త్వరలోనే వెల్లడిస్తామని జడ్జి తెలిపారు. పీటన్ జాన్ తక్కువ సమయంలోనే బరువు పెరగడం వల్ల అతను కూర్చున్న చోటు నుంచి కదలలేక పోతున్నా అదే సమయంలో కోర్టు శిక్ష నుంచి తాత్కాలికంగా తప్పించుకున్నాడు.