భారతీయ సినిమాలపై పాక్ పైత్యం…!!!

-

మోడీ ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు పై తీసుకున్న సంచలన నిర్ణయంతో దిక్కు తోచని స్థితిలో ఉన్న పాకిస్థాన్ భారత్ తో ఉన్న దౌత్య, వాణిజ్య పరమైన సంభందాలని ఒక్కొక్కటిగా తెంచుకుంటూ వస్తోంది. జమ్మూకాశ్మీర్ కి స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు చర్యపై గుర్రుగా ఉన్న పాక్ ప్రధాని తమ దేశంతో భారత్ కి ఉన్న కొద్ది పాటి సంభందాలని వదులుకుంటున్నారు. ఒక పక్క భారత రాయబారి అజయ్ బిసారియా ను తమ దేశం నుంచీ బహిష్కరించిన పాక్ తాజాగా తన పైత్యాన్ని భారతీయ సినిమాలపై కూడా చూపిస్తోంది.

పాక్ దేశంలో ప్రదర్శిస్తున్న భారతీయ సినిమాలని తక్షణం నిలిపివేయాలంటూ ఆంక్షలు విధించింది. కొత్తగా వచ్చే సినిమాలు అన్నిటిపైనా నిషేధాన్ని విధించింది. ఇకపై పాక్ లో భారతీయ సినిమాల ఊసే వినిపించ కూడదు అంటూ హుకుం జారీ చేసింది. ఇదిలాఉంటే పాక్ లో భారతీయ సినిమాలపై నిషేధం గతంలో పుల్వామా ఉగ్రదాది సమయంలో కూడా విధించింది.

అయితే పాకిస్థాన్ లో ఉన్న సినిమా హాల్స్ కి ఆదాయం అధికశాతం భారతీయ సినిమాల ద్వారానే వస్తోంది. దాంతో పాక్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అక్కడి సినిమా హాల్స్ యాజమాన్యం తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టుగా తెలుస్తోంది. అంతేకాదు పాక్ ప్రజలు కూడా ప్రధాని తీసుకున్న నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. దాంతో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై ఇంటా బయటా కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news