మాకు నీళ్లు ఆపేస్తే.. భారత ప్రజల ఊపిరి తీస్తాం – పాక్ అధికారి

-

ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మొన్నటి వరకు యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. జమ్ము కాశ్మీర్ లోని పహల్గం ప్రాంతంలో ఇండియాకు సంబంధించిన 28 మందిని అన్యాయంగా పాకిస్తాన్ ఉగ్రవాదులు చంపేశారు. దీంతో మోడీ ప్రభుత్వం తగ్గేదే లేదంటూ… ఆపరేషన్ సింధూర్ పేరుతో రివర్స్ అటాక్ చేసింది.

ఈ నేపథ్యంలో దాదాపు 150 మంది ఉగ్రవాదులు మరణించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఉగ్రవాదులపై దాడులు చేస్తే పాకిస్తాన్ ఆర్మీ కూడా రంగంలోకి దిగింది. దొంగ చాటు దెబ్బ తీసే ప్రయత్నం చేసింది పాకిస్తాన్. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ యుద్ధం.. విపరీతంగా జరిగింది. ఉగ్రవాదులకు సపోర్ట్ గా నిలిచిన పాకిస్తాన్ ను ఎండబెట్టేందుకు మోడీ ప్రభుత్వం.. సింధు జలాలను ఆపేసింది. సింధు జలాలను ఆపేస్తే 80 శాతం.. పాకిస్తాన్ కరువు ప్రాంతంగా మారిపోతుంది. అయితే ఈ యుద్ధం ఆగిపోయిన నేపథ్యంలో తాజాగా పాకిస్తాన్ ఆర్మీ అధికారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news