పాకిస్తాన్ ఆర్మీ వరుస కాల్పులు, మరోసారి కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘన..!

-

భారత్ చైనాసరిహద్దుల్లో వాతావరణం కాస్త చల్లబడింది అనుకునే సమయంలో ఇప్పుడు పాకిస్తాన్ వరుసగా కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తుంది. తాజాగా భారత్ పాక్ సరిహద్దుల్లో పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. పూంచ్ జిల్లాలోని కృష్ణ ఘాటి సెక్టార్లో పాకిస్తాన్ చిన్న పాటి ఆయుదాలతో కాల్పులకు దిగింది పాకిస్తాన్. మోర్టార్ ల తో కూడా కాల్పులకు దిగింది.

ఈ కాల్పుల్లో స్థానికులు గాయపడినట్టు తెలుస్తుంది. అదే విధంగా పలువురు జవాన్ లకు కూడా ఈ కాల్పుల్లో గాయపడినట్టు తెలుస్తుంది. నిన్న ఉదయం ఒక జవాన్ ని పాకిస్తాన్ కిడ్నాప్ చేసింది అని తెలుస్తుంది. దీనిపై భారత ఆర్మీ విచారణ కూడా చేపట్టింది. ఏదో అలజడి కోసం పాకిస్తాన్ ప్రయత్నాలు చేస్తుంది అనే ఆరోపణలు ఆర్మీ చేస్తుంది. వరుస కాల్పుల విరమణ ఉల్లంఘనతో భారత ఆర్మీ అప్రమత్తమైంది.

Read more RELATED
Recommended to you

Latest news