స్టార్ హీరో సూర్య తొలి జీతం ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..!

తమిళ చిత్ర పరిశ్రమలో హీరో సూర్య కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఇటీవల ఆకాశమే హద్దురా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి చాలా రోజుల తర్వాత మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే. దక్కన్ హెయిర్ వ్యవస్థాపకుడు గోపీనాథ్ జీవిత కథ ఆధారంగా ఆకాశమే నీ హద్దురా సినిమా ప్రేక్షకులందరికీ భావోద్వేగంలో ముంచెత్తింది. సూర్య నటన విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది అన్న విషయం తెలిసిందే.

surya

ఇటీవలే ఈ సినిమా గురించి మాట్లాడిన హీరో సూర్య తన అనుభవాలను అభిమానులతో పంచుకున్నారు. ఆకాశమే నీ హద్దురా సినిమాలో తన పాత్ర వ్యక్తిగతంగా తనకు ఎంతగానో దగ్గరయ్యింది అంటూ చెప్పుకొచ్చాడు. తన తండ్రి సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ తన కాళ్ళ మీద తాను నిలబడాలని తన కుటుంబం భావించిందని అందుకే డిగ్రీ పూర్తవగానే ఒక వస్త్ర పరిశ్రమలో ఉద్యోగానికి చేరాను అంటూ చెప్పుకొచ్చాడు సూర్య. ఆ సమయంలో తన మొదటి జీతం 736 రూపాయలు అని ఆ రోజులు ఎప్పటికీ గుర్తుంటాయి అంటూ చెప్పుకొచ్చాడు. ఆ రోజులను చూశాను కాబట్టి ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలలో ఎక్స్ ప్రెషన్స్ బాగా ఇవ్వగలిగాను అంటూ తెలిపాడు.