భారీ భద్రత నడుమ.. బుల్లెట్‌ ప్రూఫ్‌ హెల్మెట్‌తో కోర్టుకు ఇమ్రాన్‌ ఖాన్‌!

-

ఉగ్రవాదం, హత్యలు, దోపిడీ వంటి అభియోగాలపై దాదాపు 100 కేసుల్లో పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ నిందితుడిగా ఉన్నారు. అయితే ఉగ్రవాదం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇమ్రాన్‌ ఖాన్‌ తాజాగా కోర్టుకు హాజరయ్యారు. భారీ భద్రత నడుమ ఆయన లాహోర్‌ కోర్టుకు వచ్చిన వీడియోలను పీటీఐ ట్విటర్‌లో షేర్‌ చేసింది.

తనను చంపేందుకు కుట్ర జరుగుతోందని.. వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకాలేనని, కేసు విచారణ ఆన్‌లైన్‌లో జరపాలని ఇమ్రాన్‌ఖాన్‌ గతంలో న్యాయమూర్తికి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ఆయనకు గట్టి భద్రత కల్పించాలని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. దీంతో ఇమ్రాన్‌ఖాన్ కోర్టుకు హాజరయ్యేందుకు పోలీసులు బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్లను అడ్డుపెట్టి భద్రత ఏర్పాటు చేశారు.

ఇమ్రాన్‌ పార్టీ పీటీఐ ట్వీట్ చేసిన వీడియోలో కమాండోలు బుల్లెట్‌ ప్రూప్‌ జాకెట్లతో ఇమ్రాన్‌ఖాన్‌ చుట్టూ భద్రత కల్పించారు. ఆయన తలకు గుండ్రటి బుల్లెట్‌ ప్రూఫ్‌ హెల్మెట్‌ ధరించగా, ఇద్దరు వ్యక్తులు ఆయన చేతులు పట్టుకుని నడిపిస్తూ న్యాయస్థానంలోకి తీసుకొని వెళ్లిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అయితే, ఇమ్రాన్‌ తలపై ముసుగు వేసినట్టుగా తీసుకెళ్లడంపై విమర్శలు వస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news