మన దాయాది దేశం పాకిస్తాన్ ప్రపంచానికి ఎంతో అమాయకంగా కనపడటానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. నీతులు చెప్తూ ఆ దేశం చేసే పనుల గురించి ప్రపంచానికి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తూ మన దేశంపై ఆ దేశం పన్నే కుట్రలు అన్నీ ఇన్ని కావు. ఇదంతా బాగానే ఉంది… మరి తన సరిహద్దుని పంచుకుని ఉన్న ఆఫ్ఘనిస్తాన్ ని పాకిస్తాన్ ఏ విధంగా చూస్తుంది…? దీని గురించి తాజాగా ఒక ఆందోళనకర విషయ౦ బయటకు వచ్చింది… అసలు పాకిస్తాన్ చేస్తున్న పనుల గురించి సంస్థ వెల్లడించిన విషయాలు తెలిస్తే… రక్తం మరిగిపోతుంది.
ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఎక్కువగా ఉగ్రవాద శిక్షణా శిబిరాలను పాకిస్తాన్ నిర్వహిస్తున్దనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక్కడే పాకిస్తాన్ మరీ దరిద్రంగా వ్యవహరిస్తుంది. స్కూల్ కి వెళ్ళే చిన్న చిన్న పిల్లలను ఉగ్రవాద శిబిరాలకు తరలించే కార్యక్రమం అక్కడి సైనికులు చేస్తున్నారు. తల్లి తండ్రులకు చెప్పి ఆర్మీలో పనులు ఇస్తామని చెప్పి వారిని తీసుకువెళ్ళి శిక్షణ ఇస్తున్నారు. తమ శత్రుదేశాల మీద వారిని ప్రయోగిస్తున్నారు. ఆత్మాహుతి దాడులకు వారిని వినియోగించే ప్రయత్నం చేస్తుంది. భారత సరిహద్దుల్లో 15 ఏళ్ళ లోపు పిల్లలకు పాకిస్తాన్ శిక్షణ ఇస్తుంది.
చురుకుగా కదిలే ఆడపిల్లలకు కూడా వారు శిక్షణ ఇస్తున్నారని నివేదిక చెప్పింది. కాశ్మీర్ లో వారికి ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వడానికి ఆర్మీ అధికారులే పని చేస్తున్నారు. అలాగే ఇరాన్ సరిహద్దుల్లో సైతం పాకిస్తాన్ వారిని వినియోగించే ప్రయత్నం చేస్తుంది. ఇక కొంత మంది సైనికులు అయితే ఆఫ్ఘన్ సరిహద్దుల్లో ఉండే పిల్లలకు అక్కడే మతతత్వ బోధనలు చేసి వారిని ఉసిగొల్పే ప్రయత్నం చేస్తున్నారు. వారి భవిష్యత్తుని నాశనం చేస్తున్నారు. కాశ్మీర్ సరిహద్దుల్లో ఉండే ఉగ్రవాదుల్లో సగానికి పైగా ఆఫ్ఘన్ గిరిజన గ్రామాలకు చెందిన చిన్నారులే ఉన్నారని నివేదిక పేర్కొంది.