నకిలీ మద్యంతో 30 వేల మంది మృతి : కన్నా లక్ష్మి నారాయణ

-

ఆంధ్రప్రదేశ్ లో సీఎంగా ఉన్న జగన్ మోహన్ రెడ్డిని గద్దె దించడమే లక్ష్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ లు కృషి చేస్తున్నాయి. ఇంకో అయిదు నెలల కాలాల్లో ఏపీలోనూ ఎన్నికలు రానుండడంతో ఇప్పటి నుండి ప్రజలను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి అధికార పార్టీపై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా టీడీపీ సీనియర్ నేత కన్నా లక్ష్మి నారాయణ సీఎం జగన్ పైన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రానున్న ఎన్నికలలో వైసీపీ ఎందుకు గెలవకూడదు మరియు సీఎం గా జగన్ ఎందుకు ఉండకూడదో తెలియచేస్తూ పుస్తకాన్ని విడుదల చేస్తామంటూ కన్నా లక్ష్మి నారాయణ మాట్లాడారు. సీఎంగా జగన్ ఏమిచేస్తే మళ్ళీ గెలిపించాలంటూ ఫైర్ అయ్యారు, అమరావతిని పూర్తిగా నిర్వీర్యం చేశారు, పెండింగ్ ప్రాజెక్ట్ లను గాలికి వదిలేశారు, రాష్ట్రాన్ని తెలంగాణకు తాకట్టు పెట్టారు లక్ష్మి నారాయణ మండిపడ్డారు.

నవరత్నాలలో ఒక రత్నం సంపూర్ణ మద్యపాన నిషేధం పేరు మీద కల్తీ మద్యాన్ని తీసుకువచ్చి రాష్ట్ర వ్యాప్తంగా 30 వేల మంది మరణానికి కారణమయ్యారంటూ విమరించారు కన్నా.

Read more RELATED
Recommended to you

Latest news