పాక్ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమ దేశంలో సీరియల్స్ లో ఆ సీన్లకు అవకాశం లేదని ఇమ్రాన్ ఖాన్ సర్కార్ చెబుతోంది. సినిమాల్లో మితిమీరిన శృంగార సన్నివేశాలు ఉండటం పట్ట ఆగ్రహం వ్యక్తం అవుతుండగా… ఇప్పుడది సీరియల్స్ కు కూడా అంటుకుంది. దీంతో ఇక నుంచి హాగ్ మరియు ఇతర రొమాంటిక్ సీన్లను రద్దు చేస్తూ.. కీలక నిర్ణయం తీసుకుంది పాక్ సర్కార్.
టీవీల్లో ప్రసారమయ్యే సీరియల్స్ లో హగ్ సీన్స్, రోమాన్స్ సన్నివేశాలు ఎక్కువగా ప్రసారం అవుతుండటంతో ఫిర్యాదు లు వచ్చాయని పెమ్రా స్పష్టం చేసింది. ఇలాంటి సీన్స్ ప్రసారం చేసే సీరియల్స్ పాక్ సమాజానికి పూర్తి వ్యతి రేకమని… నోటిఫికేషన్ లో స్పష్టం చేసింది. కౌగిలించుకోవడం, వివాహేతర సంబంధాలు లాంటి వి ఉంటే చర్యలు తప్ప వని హెచ్చరించింది పాక్ సర్కార్. ఒక వేళ ఇలాంటి సీన్లను పెడితే… పాక్ సమాజం సంస్కృతిని పూర్తి గా నిర్లక్ష్యం చేయడం కిందకు వస్తుందని పేర్కొంది.