Bigg Boss Telugu 5: ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆ కంటెస్టెంటేనా..?

-

Bigg Boss Telugu 5: బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్.. ఈ షో ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గా ఆక‌ట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఈ షో ప్ర‌సారం అయినంత సేపు అభిమానుల‌ను టీవీల‌కు క‌ట్టేస్తుందంటే అతిశ‌యోక్తి కాదు. రికార్డు స్థాయిలో టీఆర్పీ రేటింగ్ తో దూసుకుపోతుంది బిగ్ బాస్ తెలుగు 5. ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా.. ట్విస్టుల మీద ట్విస్టులు పెట్టి ఉత్కంఠ రేప‌డం బిగ్ బాస్ స్పెష‌ల్ .. ఇక ఇప్పుడూ ఏడో వారం ఎలిమినేషన్ ప‌ర్వం ప్రారంభ‌మైంది. ఇందుకు సంబంధించిన షూటింగ్ పూర్తి కావ‌డంతో ఎవ‌రూ.. ఇంటి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చారనే లీక్ అయ్యింది.

ఇప్ప‌టి వ‌ర‌కూ హౌస్ నుంచి సరయు, ఉమాదేవి, లహరి, నటరాజ్ మాస్టర్, హమీద, శ్వేతవర్మ వ‌రుస‌గా ఎలిమినేట్ కాగా.. ఈ వారం ఎవ‌రూ ఎలిమినేట్ అవుతార‌నేది ఆసక్తిగా మారింది. ఈవారం నామినేషన్స్‌లో మొత్తం ఎనిమిది మంది కంటెస్టెంట్స్ ఉండగా.. వారిలో శ్రీరామ్, కాజల్‌లను సేఫ్ చేశారు బిగ్ బాస్.. ఇక మిగిలింది. ఆరుగురు రవి, సిరి, లోబో, జెస్సి, ఆనీ, ప్రియలు ఎలిమినేష‌న్ ఘ‌ట్టంలో ఉన్నారు. వీరిలో ఎవరు ఇంటి నుంచి బ‌య‌ట‌కు వెళ్ల‌బోతున్నార‌నేది స‌స్పెస్ గా మారింది. అయితే డేంజర్ జోన్ లో ఉన్నవారిలో ఎక్కువ శాతం ఎలిమినేట్ అయ్యే అవకాశం ఎవరికీ ఉందంటే..?

ఈ వారం హౌస్ నుంచి ప్రియా ఎలిమినేట్ కావ‌డానికి ఎక్కువ చాన్స్‌లు ఉన్న‌ట్టు క‌నిపిస్తుంది. లీకుల రాయులు కూడా.. ప్రియ‌నే ఎలిమినేట్ అవుతుంద‌ని చెపుతున్నారు. ఈ వారం ప్రియ చేసిన ర‌చ్చ మాములుగా లేదు బాబ్బోయి.. హౌస్ లో దుమ్ము రేపింది. రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌లు చేస్తూ హౌస్ ను హీటెక్కించింది. ఎన్నాడు లేని విధంగా ప్రియాకు సన్నీమ‌ధ్య గొడ‌వ జ‌రిగింది.

ఈ గొడ‌వనే హైలెట్ గా నిలిచింది. చెంప పగలకొడతానని ఎన్ని స్లార్లు అంటావని, అది మాట వరకూ అయితే స‌రే.. పక్కనున్న తొట్టెను తీసుకుని సన్నీపై కోపం ప్రదర్శించ‌డ‌మేమిట‌ని ప్రియని నాగార్జున ప్ర‌శ్నించ‌డంటే.. వారి మ‌ధ్య గొడ‌వ ఏ రేంజ్ లో అయిందో అర్థం చేసుకోవ‌చ్చు. ఈ గొడ‌వ‌తో ప్రియా పై ప్రేక్షకుల్లో అభిప్రాయం మారిన‌ట్టు తెలుస్తుంది. ఆమెకు ఓట్లు తక్కువ ప‌డిన‌ట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.

కానీ ఓట్ల ప‌రంగా చూస్తే.. ఆనీ మాస్ట‌ర్ కూడా డేంజ‌ర్లోనే ఉంది. నిజానికి గ‌త రెండు వారాలుగా ఆనీ మాస్టర్‌కి ఓట్లు తక్కువ పడుతున్న‌ట్టు తెలుస్తుంది. ప్రియ‌, ఆనీ మాస్ట‌ర్ ల‌లో ఆనీమాస్ట‌ర్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా త‌క్కువ‌. ఇన్ని రోజులు ఉన్న త‌న‌కు ఫాలోయింగ్ పెర‌గ‌పోవ‌డం దుర‌దృష్ట‌కరం. శ్వేత‌ హౌస్ లో ఉన్న‌ని రోజులు.. ఆనీ మాస్ట‌ర్ మ‌ధ్య త‌ల్లి కూతుర్ల సెంటిమెంట్ న‌డిచింది.

కానీ గ‌త వారం శ్వేత హౌస్ నుంచి బ‌య‌ట‌కు వెళ్లి పోవ‌డంతో ఆ సంబంధం తెగిపోయింది. ఇప్ప‌డు ఆనీ మాస్ట‌ర్ ఎలిమినేట్ చేస్తే.. బిగ్‌బాస్‌ షోలో ఈ తల్లీకూతుళ్ల బంధానికి ముగింపు పలికారంటూ ప్రచారం చేస్తారు అభిమానులు. ఈ నేపథ్యంలో ఎవ‌రూ ఎలిమినేట్ అవ్వనున్నారో .. మరి ఏం జరుగుతుందో.. మ‌రి కొన్ని గంట‌లు వేచి చూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version