పాకిస్తాన్ మహిళా క్రికెట్ కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. గత మూడు రోజుల క్రితమే పాకిస్తాన్ మహిళా క్రికెటర్ అయేషా క్రికెట్ నుండి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చింది. కాగా ఇప్పటికి ఈమె వయసు కేవలం 18 సంవత్సరాలు కావడం విశేషం. ఈ విషయం మరిచిపోతున్న సమయంలో మరో షాక్ తగిలింది పాకిస్తాన్ క్రికెట్ కు… తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం త్వరలో చైనా వేదికగా గ్యాంగ్జౌ లో జరగనున్న ఆసియా గేమ్స్ లో సెప్టెంబర్ 19 నుండి 26 వరకు జరగనున్న విషయం తెలిసిందే. ఇక టోర్నమెంట్ నియమ నిబంధనల ప్రకారం ఇక్కడకు టోర్నీలో పాల్గొనే క్రీడాకారులు పిల్లలను తీసుకుని రాకూడదని నిర్వాహకులు చెప్పడంతో.. పాకిస్తాన్ మహిళా క్రికెట్ టీం కు చెందిన మాజీ కెప్టెన్ బిస్మా మరూప్ ఆసియా గేమ్స్ నుండి తోలగిపోతున్నట్లు ప్రకటించింది. కాగా ఈమెకు రెండేళ్ల బిడ్డ ఉండడంతోనే ఈ కఠినమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
అయితే టోర్నమెంట్ కు ఇంకా సమయం ఉన్నందున పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఏమైనా ఆసియా గేమ్స్ నిర్వాహకులతో మాట్లాడుతారా చూడాలి.