Asia Cup 2022 : ఉత్కంఠ పోరులో ఇండియా పై పాక్ గ్రాండ్ విక్టరీ

-

ఆసియా కప్‌ లో తొలి ఓటమిని చవి చూసింది టీమిండియా. గ్రూప్‌ దశలో పాక్‌ పై విజయం సాధించిన టీమిండియా… సూపర్‌ 4 దశలో మాత్రం చేతులెత్తేసింది. ఆదివారం హోరా హోరీ పోరులో భారత్‌ 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది. మొదట కోహ్లీ 60 పరుగులు చేయగా.. కేఎల్‌ రాహుల్‌ 28 పరుగులు, రోహిత్‌ శర్మ 28 పరుగులు చేసి.. రాణించడంతో… టీమిండియా 7 వికెట్లకు 181 పరుగులు చేయగలిగింది.

పాక్‌ బౌలర్లలో షాదాబ్‌ కాన్‌ 2 వికెట్లు, మహ్మద్‌ నవాజ్‌ 1 వికెట్‌ తీశారు. అనంతరం ఛేజింగ్‌ కు దిగిన పాక్‌.. ఆది నుంచి చివరి వరకు మంచి ఆటతీరును కనబరిచింది. మహ్మద్‌ రిజ్వాన్‌ ఏకంగా 71 పరుగులు చేయగా.. నవాజ్‌ 42 పరుగులు చేశాడు. దీంతో… 19.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి.. టీమిండియాపై విజయం సాధించింది పాకిస్తాన్‌. ఇక భారత బౌలర్లలో భువనేశ్వర్‌ కుమార్‌ 1 వికెట్‌ తీయగా… ఆర్షదీప్‌ సింగ్‌, రవి బిష్ణోయ్‌, పాండ్యా, చాహాల్‌ తలో వికెట్‌ తీశారు. కానీ మన బౌలర్లు.. విపరీతంగా పరుగులు ఇవ్వడంతో.. పాక్‌ విజయం సాధించింది.

Read more RELATED
Recommended to you

Latest news