ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ ఆహారాల‌ను తీసుకోవాలి..!

-

ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న ప్ర‌జ‌ల‌ను క‌రోనా మ‌హ‌మ్మారి తీవ్రంగా భ‌య‌పెడుతోంది. క‌రోనా సోకితే.. ఆ వైర‌స్ ముందుగా మ‌న శ్వాస‌కోశ‌వ్య‌వ‌స్థ‌పై దాడి చేస్తుంది. అందులో క‌ణాల‌ను నాశ‌నం చేస్తుంది. ఈ క్ర‌మంలో ఊపిరితిత్తుల్లోని క‌ణాలు చ‌నిపోతాయి. అయితే క‌రోనాను ఎదుర్కోవాలంటే.. డాక్ట‌ర్లు ఇచ్చే మందుల‌తోపాటు.. రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచే ప‌లు ఆహారాల‌ను కూడా తీసుకోవాలి. క‌రోనా రాకున్నా స‌రే.. కింద సూచించిన ఆహారాల‌ను ప్ర‌తి ఒక్క‌రూ తీసుకుంటే.. త‌ద్వారా ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. దీంతో ఒక‌వేళ కరోనా సోకినా.. పెద్ద‌గా నష్టం లేకుండానే స్వ‌ల్ప అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బ‌య‌ట‌ప‌డేందుకు అవ‌కాశం ఉంటుంది. ఇక మ‌న ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఏయే ఆహారాల‌ను తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామా..!

దానిమ్మ…

దానిమ్మ పండ్ల‌లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్దిగా ఉంటాయి. ఇవి ఊపిరితిత్తులలో కణాల‌ను ర‌క్షిస్తాయి. అందువ‌ల్ల వైర‌స్‌ల బారి నుంచి క‌ణాక‌లు ర‌క్ష‌ణ ల‌భిస్తుంది. అలాగే క‌ణతులు ఏర్ప‌డ‌కుండా ఉంటాయి. దీంతోపాటు శ్వాస‌కోశ స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. నిత్యం దానిమ్మ గింజ‌ల‌ను తిన‌డం లేదా దానిమ్మ ర‌సాన్ని తాగ‌డం వ‌ల్ల ముందు చెప్పిన ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి.

ఉల్లిపాయలు…

ఉల్లిపాయ‌ల్లో ఉండే స‌ల్ఫ‌ర్ ఊపిరితిత్తుల ఆరోగ్యానికి అద్భుతంగా ప‌నిచేస్తుంద‌ని సైంటిస్టులు చెబుతున్నారు. అందువ‌ల్ల ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే.. నిత్యం ఉల్లిపాయ‌ల‌ను తినాల‌ని వారు సూచిస్తున్నారు.

యాపిల్స్…

వీటిల్లో ఫ్లేవనాయిడ్స్ అన‌బ‌డే యాంటీ ఆక్సిడెంట్ల‌తోపాటు విటమిన్ బి, సి, ఇ లు పుష్క‌లంగా ఉంటాయి. ఇవి ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగు ప‌రుస్తాయి.

ద్రాక్ష…

ద్రాక్ష పండ్ల‌లో నరింగిన్ అన‌బ‌డే ఫ్లేవ‌నాయిడ్ ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్‌లా ప‌నిచేస్తుంది. ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని ప‌దిలంగా ఉంచుతుంది. ఊపిరితిత్తులు శుభ్రంగా మారుతాయి.

ఆరెంజ్‌…

నారింజ పండ్ల‌లో విట‌మిన్ సి పుష్క‌లంగా ఉంటుంది. ఇది మ‌న శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. దీంతో మ‌న శ‌రీరంలో చేరే వైర‌స్‌లు, బాక్టీరియాలు న‌శిస్తాయి. ఈ క్ర‌మంలో లంగ్స్ ఆరోగ్యంగా ఉంటాయి.

క్యారెట్లు…

వీటిలో విట‌మిన్ ఎ, సిలు పుష్క‌లంగా ఉంటాయి. ఇవి శ్వాస‌కోశ స‌మ‌స్య‌ల‌ను న‌యం చేస్తాయి. ఊపిరితిత్తుల‌ను ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని కూడా పెంచుతాయి.

బీన్స్‌…

వీటిని త‌ర‌చూ తిన‌డం వ‌ల్ల ఊపిరితిత్తుల‌ను ఆరోగ్యంగా ఉంచుకోవ‌చ్చు. వీటిల్లో ఉండే మెగ్నిషియం ఊపిరితిత్తుల‌కు మేలు చేకూరుస్తుంది.

న‌ట్స్‌…

బాదం, పిస్తా ప‌ప్పులు, వాల్‌న‌ట్స్‌, హేజ‌ల్ న‌ట్స్‌.. త‌దిత‌ర న‌ట్స్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు స‌మృద్ధిగా ఉంటాయి. ఇవి శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి. దీంతో లంగ్స్ ఆరోగ్యంగా ఉంటాయి. ఇన్‌ఫెక్ష‌న్లు రాకుండా ఉంటాయి.

ప‌సుపు…

ప‌సుపులో క‌ర్‌క్యుమిన్ అన‌బ‌డే స‌మ్మేళ‌నం ఉంటుంది. ఇది ఊపిరితిత్తుల‌ను ర‌క్షిస్తుంది. వైర‌స్‌ల‌ను నాశ‌నం చేస్తుంది. నిత్యం పాల‌ల్లో ప‌సుపును క‌లుపుకుని తాగ‌డం వ‌ల్ల శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి కూడా పెరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version