ప్రభాకర్ కేసులో నిందితుడిని భట్టి కారులో ఎక్కించుకొని తిప్పుకుంటున్నాడు – పల్లా

-

 

ప్రభాకర్ ఆత్మహత్య కేసులో ఉన్న A3 నిందితుడిని భట్టి విక్రమార్క తన కార్లో ఎక్కించుకొని తిప్పుకుంటున్నాడని బీఆర్‌ఎస్‌ జగిత్యాల ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆత్మహత్య చేసుకున్న ఖమ్మం రైతు ప్రభాకర్ కుటుంబాన్ని పరామర్శించింది బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రతినిధుల బృందం.

బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసిఆర్ ఆదేశాలతో మృతి చెందిన రైతు బోజేడ్ల ప్రభాకర్ కుటుంబానికి న్యాయం జరగాలని ఆకాంక్షిస్తూ ఖమ్మం పోలీస్ కమిషనర్ ని కలిసింది బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రతినిధుల బృందం. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ… ప్రభాకర్ ఆత్మహత్య కేసులో ఉన్న A3 నిందితుడిని భట్టి విక్రమార్క తన కార్లో ఎక్కించుకొని తిప్పుకుంటున్నాడు.. పోలీసులు కొందరు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు,అన్ని నోట్ చేస్తున్నామన్నారు. బాధితుల దగ్గరకు పోవాల్సిన భట్టి,నిందితుల ఇంటికి పోయిండని వెల్లడించారు. రైతు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయకపోతే అగ్గి పుట్టిస్తామని హెచ్చరించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news