జైలు ఫుడ్డు బాగుంది: పల్లవి ప్రశాంత్

-

కామన్ మాన్ గా బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చి ఎంతో పట్టుదలతో ఆడి విన్నర్ అయ్యాడు పల్లవి ప్రశాంత్. రైతుబిడ్డ గా వ్యవసాయ పనులు చేసుకునే పల్లవి ప్రశాంత్ లక్షల మంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు. బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత గ్రాండ్ ఫినాలే రోజు పెద్ద ఎత్తున ర్యాలీకి వెళ్తూ అభిమానులు ప్రభుత్వ ప్రైవేటు ఆస్తులని ధ్వంసం చేశారు. ఈ కారణంగా పోలీసులు ప్రశాంత్ మీద కేసులు నమోదు చేశారు. ఏకంగా రెండు రోజులపాటు జైల్లో పెట్టారు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పల్లవి ప్రశాంత్ రైతు జీవితం గురించి మాట్లాడారు మొదటిసారిగా జైలు ముఖం చూసాను ఆ రెండు రోజులు కష్టంగా గడిచాయి అన్నం కూడా తినాలనిపించలేదు. తోటి ఖైదీలు అందరూ బతిమిలాడి భోజనం పెట్టారు అక్కడ నన్ను ఒక విఐపిలా ట్రీట్ చేసిన చేయకపోయినా జైలు ఫుడ్ మాత్రం బాగుంది అక్కడి ఖైదీలు నాతో అన్న అంటూ మాట్లాడారు. ఉన్న రెండు రోజులు కూడా చాలా విషయాలను నేర్చుకున్నాను తప్పు చేయకపోయినా జైలుకు వెళ్లాల్సి వచ్చింది అందుకే నేను భయపడలేదు అని పల్లవి ప్రశాంత్ చెప్పాడు.

Read more RELATED
Recommended to you

Latest news