గడువు తేదీ పాన్ కి ఉంటుందా..? చనిపోయిన వ్యక్తి కార్డును ఏం చెయ్యాలి..?

-

మనకి ఉండే ముఖ్యమైన డాక్యుమెంట్ల లో పాన్ కార్డు కూడా ఒకటి. ట్రాన్సాక్షన్స్ చేయడానికి మొదలు ఇన్కమ్ టాక్స్ ఫైల్ చేయడానికి పాన్ కార్డ్ చాలా అవసరం. అయితే పాన్ కార్డ్ విషయంలో నిర్లక్ష్యం పనికి రాదు. మోసాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది కాబట్టి సక్రమంగా వాడాలి అని ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ అంటోంది.

అలానే పాన్ కార్డు కలిగిన వ్యక్తి ఈ విషయాలను కూడా తప్పక చూడాలి. పాన్ కార్డ్ జీవితకాల చెల్లుబాటును కలిగి ఉంటుంది. ఒకవేళ పాన్ కార్డు కనుక ఓసారి వస్తే అది జీవితాంతం వ్యాలిడ్ అవుతుంది. వ్యక్తి జీవించి ఉన్నంత వరకు అది పని చేస్తుంది. పాన్ కార్డు పది నెంబర్లు వుండే ఆల్ఫాన్యూమరిక్ నంబర్.

ఒకవేళ కనుక పాన్ కార్డు వున్న వ్యక్తి చనిపోతే పాన్ కార్డ్ సరెండర్ చెయ్యాల్సి వుంది. ఆదాయపు పన్ను శాఖ ఈ ఫెసిలిటీని ఇచ్చింది. ఒక వ్యక్తి చనిపోయాక ఆ వ్యక్తి పాన్ కార్డుని డియాక్టివేట్ చేసేయచ్చు లేదా సరెండర్ చేసేయచ్చు. మరి అది ఎలానో చూసేద్దాం.

పాన్ కార్డును ఇలా సరెండర్ చేయాలి:

దీని కోసం ముందుగా మీరు అసెస్‌మెంట్ ఆఫీసర్‌ కి దరఖాస్తు చెయ్యాలి.
అయితే పాన్ కార్డును సరెండర్ చేయడానికి రీజన్ ని చెప్పాల్సి వుంది.
మరణించిన వ్యక్తి పేరు, పుట్టిన తేదీ, మరణ ధృవీకరణ పత్రం వంటి డీటెయిల్స్ ని ఇవ్వాలి.
వాటితో పాటు మీరు మరణ ధృవీకరణ పత్రాన్ని కూడా ఇవ్వాల్సి వుంది.
మీరు దరఖాస్తు కాపీని ఉంచుకోవాలి.
నెక్స్ట్ మీరు పాన్ కార్డ్ సరెండర్ రుజువు ఇవ్వవచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news