చాలా మంది పిల్లలు తల్లిదండ్రుల మాటల్ని వినరు. ఏమైనా చెప్తే కూడా అసలు లెక్కచేయరు. అటువంటి ప్రవర్తన పిల్లల్లో ఉండడం మంచిది కాదు. తల్లిదండ్రులే ఆ ప్రవర్తన నుండి వాళ్ళని బయటికి తీసుకురావాలి. అది తల్లిదండ్రులు చేతుల్లోనే ఉంది. అయితే మరి పిల్లలు మొండిగా ప్రవర్తిస్తే తల్లిదండ్రులు ఏం చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
పిల్లలతో మీరు మాట్లాడండి:
పిల్లలతో మీరు వీలైనంతవరకు ఎక్కువ సమయాన్ని కేటాయించండి. వాళ్లకి కథలు ఆసక్తికరమైన విషయాలని చెప్తూ ఉండాలి. ఇలా వాళ్లతో మీరు మీ సమయాన్ని కేటాయించడం వల్ల సాన్నిహిత్యాన్ని పెంచుతుంది.
కోపంగా అరవకండి:
పిల్లలు మీ మాట వినడం లేదని కోపంగా వాళ్లతో అరవద్దు. అరవడం వల్ల ఆందోళన వాళ్ళలో కలుగుతుంది. దీంతో మొండిగా ప్రవర్తిస్తుంటారు. ప్రశాంతంగా మొదట మీరు ఉండి నెమ్మదిగా వాళ్లకి చెప్పండి. క్రమశిక్షణతో ఉండాలని మంచిగా ప్రవర్తించాలని నెమ్మదిగా వాళ్ళకి చెప్తే అలవాటు చేసుకుంటారు.
పిల్లలకి సమయం ఇవ్వండి:
చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు చెప్పేది వినరు. ఎంతసేపు తల్లిదండ్రులే చెప్పకు పోతూ ఉంటారు. అలా కాకుండా ఒకసారి సమయం ఇచ్చి వాళ్ళు చెప్పేది వినండి. ఆ తర్వాత మీరు చెప్పండి అప్పుడు ఖచ్చితంగా పిల్లల బాధ మీకు అర్థం అవుతుంది. ఏం చేయాలి అనేది కూడా మీకు తెలుస్తుంది. మీరు కనుక వినకపోతే నిజంగా వాళ్లకి సమస్య ఉన్నా మీకు తెలియదు.
ఇతరులతో మీ పిల్లల్ని పోల్చొద్దు:
ఎప్పుడూ కూడా మీ పిల్లలను ఇతరులతో పోల్చద్దు. దీని వల్ల వాళ్ళు బాధపడుతూ ఉంటారు వాళ్ళ యొక్క బలహీనతను బలాన్ని గుర్తించి దానికి తగ్గట్టుగా మీరు మార్పులు చేయండి అంతేకానీ ఇతరుల గురించి మీరు వారికి చెప్పద్దు.