తల్లిదండ్రులు పిల్లలకు ప్రతి విషయాన్ని నేర్పుతూ ఉండాలి. అప్పుడే పిల్లలు వాటిని నేర్చుకోవచ్చు. చిన్నప్పటి నుండి వాళ్లనే సరి చేస్తూ ఉంటే పెద్దయ్యాక తప్పులు చేయరు కూడా చాలా మంది తల్లిదండ్రులు గారాభం చేసి పిల్లల్ని అనవసరంగా చెడగొడుతుంటారు. దీంతో పిల్లలు పెద్దయ్యాక చెడు అలవాట్లు మాత్రమే నేర్చుకుంటారు. చదువుకు సంబంధించి కూడా తల్లిదండ్రులు పిల్లలకు చెప్పాలి. అయితే మరి పిల్లల్లో రీడింగ్ స్కిల్స్ ని ఎలా పెంచవచ్చు అనేది ఇప్పుడు చూద్దాం.
చదవడం వల్ల కలిగే ప్రయోజనాలు:
నిజానికి నవలలూ, న్యూస్ పేపర్లు ఇలాంటివి చదివితే పిల్లలకి చాలా లాభాలు కలుగుతాయి అందుకని తల్లిదండ్రులు కచ్చితంగా పిల్లలకు చదవడం నేర్పాలి.
చదవడాన్ని ఫన్నీ గా చెప్పండి:
ఫన్నీ గా చదవడంని వాళ్ళకి నేర్పితే కచ్చితంగా వాళ్ళు ఆసక్తి చూపిస్తారు. ఎప్పుడైతే వాళ్ళు చదువుతున్నప్పుడు ఆనందంగా ఉంటారో అప్పుడే వాళ్ళు చదవగలరు కూడా.
ముఖ్యమైన వాటిని హైలెట్ చేయించండి:
పిల్లలు ఏదైనా చదువుతున్నప్పుడు వాళ్ళ చేత ముఖ్యమైన పాయింట్లు వస్తే హైలెట్ చేయించండి అప్పుడు వాళ్లు గుర్తుంచుకోవడానికి బాగుంటుంది.
పైకి చదవమనండి:
వాళ్లకి వాళ్ళు అద్దంలో చూసుకోమనో లేదంటే పక్కన మీరు ఉండి గట్టిగా పైకి చదవమనడం లాంటివి చేస్తే పదాలు సరిగ్గా పలకడం వస్తుంది.
రీడింగ్ గోల్స్ పెట్టండి:
రోజు కొంత చదవాలని టార్గెట్ పెట్టండి పిల్లలు ఎక్కువసేపు కూర్చుని చదవడానికి ఇష్ట పడరు కాబట్టి మీరు పెట్టిన టాస్క్ కంప్లీట్ చేసేంతవరకు చదవడానికి చూడండి.
మధ్యలో ప్రశ్నలు అడగండి:
మీరు ప్రశ్నలు అడిగితే వాళ్ళు బాగా గుర్తు పెట్టుకుంటారు పైగా వాళ్ళు సమాధానం ఇచ్చిన ప్రశ్నలు మర్చిపోవడానికి అవ్వదు. చెప్పని వాటిని మళ్లీ చదివించండి.
సందేహాలని క్లియర్ చేయండి:
ఒకవేళ వాళ్లకు ఏమైనా సందేహాలు ఉంటే వాటిని మీరు క్లియర్ చేస్తూ ఉండండి.
మీరు కూడా మీ పిల్లలతో పాటు చదవండి:
కేవలం వాళ్ళే కాకుండా మీరు కూడా వాళ్ళ పక్కన కూర్చుని చదువుకుంటే వాళ్ళకి కూడా చదువు పట్ల ఆసక్తి కలుగుతుంది.