వర్షాకాలం మొదలైపోయింది., ఆంధ్ర ప్రదేశ్ లో పెద్దగా ప్రభావం చూపకపోయినా తెలంగాణాలో తన కసిని అంతా తీర్చుకుంటోంది. గత వారం రోజుల నుండి తెలంగాణను వీడకుండా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండి పరిస్థితిని గమనిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇక ఇటువంటి భారీ వర్షాల సమయంలో చిన్న పిల్లల పట్ల తల్లితండ్రులు చాలా అప్రమత్తంగా మరియు జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది. చిన్న పిల్లలను ఎటువంటి పరిస్థితులలోనూ దగ్గర్లోనే మ్యాన్ హొల్స్ దగ్గర లేకుండా జాగ్రత్త పడండి.. ఇంకా మీ ఇంటి దగ్గర్లోనే చిన్న చిన్న కాలువలు, మురికి గుంతలు, చెరువులు వద్దకు అస్సలే వెళ్ళడానికి అస్సలు అనుమతించకండి. పిల్లలు వర్షంలో ఆడుకోవాలని ఎంత మారం చేసినా అనుమతించకండి అంటూ ప్రభుత్వం మొరపెట్టుకుంటోంది.