బాలీవుడ్ తలకిందులు! ఒక్క ఛాన్స్ అంటున్న బ్యూటీ.!

-

ఎప్పుడయితే బహుబలి పాన్ ఇండియా స్థాయి విజయం సాధించడం , దానికి తోడు  కేజీఫ్ లాంటి సూపర్ హిట్స్ రావటం వల్ల బాలీవుడ్లో అందరూ దక్షిణాది సినీ పరిశ్రమ వైపు అడుగులు వేయడం మొదలు పెట్టారు. ఇప్పుడు సౌత్ సినిమాలు చేయాలనీ చాలా మంది తహతహలాడుతున్నారు. తాజాగా ఓ ముద్దుగుమ్మ కూడా సౌత్ చేయాలనీ ఎదురుచూస్తున్నా అని మనసులో మాట బయట పెట్టింది. ఆ బ్యూటీ ఎవరో కాదు బాలీవుడ్ భామ పరిణితి చోప్రా.

ఢిల్లీలో జరిగిన అజెండా ఆజ్‌తక్‌ 2022 అనే కార్యక్రమంకు పరిణితి చోప్రా హాజరయ్యింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆసక్తికర విషయాలు చెప్పింది. ‘నేను సౌత్‌ లో నటించడానికి ఎంతలా ఆరాటపడుతున్నానో మీకెవరికీ తెలియదు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ.. ఏ భాష అయినా ఫర్వాలేదు. ఒక మంచి లో నటించాలని చాలాకాలంగా ఎదురుచూస్తున్నాఅని చెప్పుకొచ్చింది.

అలాగే ఒక మంచి దర్శకుడు, సరైన స్క్రిప్ట్‌ కలిస్తే అద్భుతమైన ప్రాజెక్టు బయటికొస్తుంది. అలాంటి అవకాశం నాకు దక్కాలి. దయచేసి మీలో ఎవరికైనా ఒక గొప్ప దర్శకుడి గురించి తెలిస్తే చెప్పండి’ అంటూ రిక్వెస్ట్ చేస్తోంది. విచిత్రంగా అంతకు ముందు వరకు భారతీయ సినిమా అంటే బాలీవుడ్ మాత్రమే అనేవారు. వారు కూడా సౌత్ ఇండియా హీరోలను, సినిమాలను చీప్ మసాలా సినిమాలు గా చూసే వారు. ప్రస్తుతం బొమ్మ తిరగబడింది.ఇంతగా ఆసక్తి కనపరుస్తున్న ఈ పరిణీతి చోప్రా కు మన దర్శకులు ఛాన్స్ ఇస్తారేమో చూడాలి

 

Read more RELATED
Recommended to you

Exit mobile version