BREAKING : లోక్ సభ స్పీకర్ అలక , ఆగ్రహం , గైర్హాజరు … !

-

ప్రస్తుతం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. గత వారం రోజుల నుండి దేశంలోని కొన్ని కీలకమైన సమస్యలు మరియు కొత్తగా తీసుకురానున్న చట్టాల గురించి పార్లమెంట్ లో చర్చించడం జరిగింది. మామూలుగానే విపక్షాలు నుండి అధికార పార్టీకి కొంతమేర వ్యతిరేకత ఉండనే ఉంటుంది. అందులో భాగంగా అప్పుడప్పుడు నిరసనల నేపథ్యంలో సభ ఆర్డర్ తప్పుతూ ఉంటుంది. ఇక్కడ పార్లమెంట్ లోనూ అదే కొన్ని రోజులుగా జరుగుతోందట. ఈ విషయంపై లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా అలక పూనారు, పార్లమెంట్ లో సభ జరిగే తీరు తనకు నచ్చడం లేదని సభకు నేను రానని మొండికేశారు. సభలో ఉన్న సభ్యులు ఎవ్వరూ కూడా నేను చెప్పినట్లు వినడం లేదని తీవ్ర అసంతృప్తిని వెళ్లగక్కారు. సభలో ఉన్న సభ్యులు అందరూ గౌరవాన్ని ఇచ్చే అంత వరకు నేను ఈ సభకు స్పీకర్ గా నేను ఉందనతో చెప్పారు.

అందులో భాగంగా ఈ రోజు పార్లమెంట్ లోకి వచ్చినా స్పీకర్ స్థానంలోకి వెళ్ళలేదు. మరి ఈయన అలకను సభ సభ్యులు అర్ధం చేసుకుంటారా ? ఒక మంచి అగ్రిమెంట్ ద్వారా సభాపతిని ఒప్పిస్తారా చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news