సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్గా పాట్ కమిన్స్ రాణిస్తారు: స్టీవ్ స్మిత్

-

ఐపీఎల్ 17వ సీజన్ మార్చి 22వ తేదీన ప్రారంభం కానుంది.ఇక ఈ ఐపీఎల్‌ సీజన్‌కు గాను సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ ఫ్రాంచైజ్… కొత్త కెప్టెన్‌ను ప్రకటించింది. కోట్లు ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ పాట్‌ కమిన్స్‌ను సారథిగా నియమించింది. ఇటీవలే ముగిసిన ఐపీఎల్‌ వేలంలో ఏకంగా రూ. 20.50 సన్రైజర్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. సౌత్ ఆఫ్రికా ప్లేయర్ మార్క్‌రమ్‌ను ఐపీఎల్‌లో సారథిగా తప్పించి కమిన్స్‌కు కెప్టెన్ గా బాధ్యతలు అప్పగించింది.

IPL 2024 Aus Pat Cummins SRH Captain

సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ గా ప్యాట్ కమిన్స్ రాణిస్తారని ఆస్ట్రేలియా ప్లేయర్ స్టీవ్ స్మిత్ ధీమా వ్యక్తం చేశారు. ‘హైదరాబాద్ హెడ్ కోచ్ వెటోరీ ఆస్ట్రేలియా టీమ్కు అసిస్టెంట్ కోచ్ కూడా. ఆయనతో కమిన్కు చక్కటి అనుబంధం ఉంది అని అన్నారు. పైగా కెప్టెన్సీ బాధ్యత ఉన్న ప్రతిసారీ కమిన్స్ అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తారు. ఈసారి సన్ రైజర్స్ రాణిస్తుందని నాకు పూర్తి నమ్మకం ఉంది’ అని స్టీవ్ స్మిత్ వ్యాఖ్యానించారు.ఇదిలా ఉంటే….ఆస్ట్రేలియా కెప్టెన్లతో హైదరాబాద్‌ సన్ రైజర్స్ ఫ్రాంచైజీకి విడదీయరాని అనుబంధం ఉంది. ఐపీఎల్‌లో ఇంతవరకు హైదరాబాద్‌కు 2 సార్లు టైటిల్ ను (ఒకసారి డెక్కన్‌ ఛార్జర్స్‌, మరోసారి సన్‌ రైజర్స్‌) అందించింది ఆసీస్ ప్లేయర్స్ మాత్రమే.

Read more RELATED
Recommended to you

Latest news