తమ ప్రాణాలు అడ్డువేసి అయినా సరే విశాఖ ఉక్కును కాపాడుకుంటాము: వైఎస్ షర్మిల

-

సీఎం జగన్‌పై కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి

తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఎందుకు పోరాటం చేయలేదని షర్మిల ప్రశ్నించారు..విశాఖ స్టీల్ ప్లాంట్ మైదానంలో కాంగ్రెస్ నిర్వహిస్తున్న న్యాయసాధన సభలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…. విభజన హామీలపై వైసీపీ నాయకులు పోరాటం చేయకపోవడాన్ని ఆమె ప్రశ్నించారు. విశాఖ ఉక్కు పరిశ్రమపై కుట్రలు పన్నుతున్నారని షర్మిల ధ్వజమెత్తారు. ఇందులో భాగంగానే పరిశ్రమను నష్టాల ఊబిలోకి నెడుతున్నారని విమర్శించారు. 30 వేల మంది కార్మికుల బతుకులు రోడ్డు మీదకు నెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తమ ప్రాణాలు అడ్డువేసి అయినా సరే విశాఖ ఉక్కును కాపాడుకుంటామని హామీ ఇచ్చారు. ప్రతేక హోదా, ఆంధ్ర ప్రదేశ్ రాజధానిపై కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయడం లేదని ఆమె ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎక్కడ చూసిన ల్యాండ్, మైనింగ్, లిక్కర్ మాఫియనే కనిపిస్తోందని,సంపూర్ణ మద్యపాన నిషేధం హామీ ఏమైందని వైఎస్ షర్మిల నిలదీశారు.

Read more RELATED
Recommended to you

Latest news