ఎంపీ మాధవ్‌ న్యూడ్‌ వీడియోపై పట్టాభి సంచలన వ్యాఖ్యలు

-

హిందూపురం వైసీపీ పార్టీ ఎంపీ మాధవ్‌ న్యూడ్‌ వీడియోపై పట్టాభి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాధవ్ వ్యవహారంతో ఏపీ ప్రజలు సిగ్గుతో తల దించుకుంటున్నారని.. ఎంపీ పై చర్యలు తీసుకోకుండా సీఎం జగన్ వెనకేసుకొస్తున్నారని ఆగ్రహించారు. ఫోరెన్సిక్ నివేదిక లేకుండానే మార్ఫింగ్ అని ఎలా తేలుస్తారు..? అని.. మేం అమెరికాలోని ఎక్లిప్స్ ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి నివేదిక తెప్పించామని పేర్కొన్నారు.

pattabhi

ఈ నెల 9 న వీడియో పంపించాం.. నిన్న నివేదిక వచ్చిందని వివరించారు. అమెరికాలో ఉండే జిమ్ స్టాఫర్డ్ అనే టెక్నికల్ ఎక్స్పర్ట్ కి పంపించామని.. వీడియో ఎడిటింగ్ చేసింది కాదని ఎక్లిప్స్ ల్యాబ్స్ తేల్చిందని స్పష్టం చేశారు. ఈ ల్యాబ్ అమెరికాలో ఫ్లోరిడాలో చాలా పేరున్న ఫోరెన్సిక్ ల్యాబ్ అని.. ఈ నివేదిక ఆధారంగా ఎంపీపై చర్యలు తీసుకోండని డిమాండ్‌ చేశారు. మాధవ్ తో రాజీనామా చేయించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పట్టాభి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version