బాబోయ్ ‘పట్నం’: కొండంగల్‌లో చాలానే చేస్తున్నారే!

-

2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వెలువడిన సంచలన ఫలితాల్లో కొడంగల్ ఫలితం ఒకటి అని చెప్పొచ్చు. రేవంత్ రెడ్డికి చెక్ పెట్టాలని చెప్పి టీఆర్ఎస్ ఎన్ని రకాల ప్రయత్నాలు చేసిందో అందరికీ తెలిసిందే. ఎలాగైనా రేవంత్‌ని ఓడించాలని పనిచేసి సక్సెస్ అయింది. అనూహ్యంగా రేవంత్ రెడ్డిపై పట్నం నరేందర్ రెడ్డి గెలిచారు. అటు ఎలాగో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. దీంతో నియోజకవర్గంలో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని అంతా అనుకున్నారు. ఎందుకంటే అంతకముందు వరకు రేవంత్ గెలిచిన, ప్రతిపక్షంలోనే ఉన్నారు.

TRS-Party | టీఆర్ఎస్

కానీ పట్నం గెలవడం, టీఆర్ఎస్ అధికారంలోకి రావడం జరిగాయి. దీంతో పట్నంపై కొడంగల్ ప్రజలు బాగానే ఆశలు పెట్టుకున్నారు. మరి ఆ ఆశలని పట్నం నెరవేరుస్తున్నారా? అంటే ఆ విషయం కొడంగల్ ప్రజల్ని అడిగితేనే బెటర్ అని చెప్పొచ్చు. ఈ మూడేళ్లలో కొడంగల్ ప్రజలకు ఒరిగింది ఏమి లేదు. పైగా ఇక్కడ పట్నం అనుచరుల అరాచకాలకు అడ్డే లేదని ప్రచారం జరుగుతుంది. ఓ మీడియా కథనం ప్రకారం..ఎవరైనా ఆ పనులు జరగడం లేదు…ఈ పనులు జరగడం లేదని ఎమ్మెల్యేని అడిగితే..నెక్స్ట్ వారిపై దాడులు జరుగుతున్నాయని తెలిసింది.

అలాగే ఎమ్మెల్యే అనుచరులు, బంధువుల భూ కబ్జాలు, అక్రమాలు లెక్కలేవని సమాచారం. ఇక ప్రజలకు ఏ పథకం కావాల్సి వచ్చిన అధికార నేతలకు కమిషన్లు ముట్టచెప్పాల్సిందే అంటా!

పెన్షన్ కావాలన్న, రైతుబంధు కావాలన్న, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ కావాలన్న, కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్‌లు కావాలన్న సరే కమిషన్లు ఇవ్వాల్సిందేనట. ఇక ఏదైనా షాపులు నడపాలని అనుకున్న…అసలు ఏ పనిచేయాల్సిన అధికార నేతలకు కమిషన్లు ఇవ్వాల్సిందే అని ఓ మీడియా కథనంలో తేలింది. మరి ఈ కథనంలో ఎంత వాస్తవం ఉందో…కొడంగల్ ప్రజలకే తెలియాలి. మొత్తానికైతే కొడంగల్‌లో ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిపై వ్యతిరేకత పెరుగుతున్నట్లు కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version