పాకిస్తాన్ లో భారీ బాంబు పేలుడు సంభవించింది. పాకిస్తాన్ లోని రెండో అతిపెద్ద నగరం అయిన లాహోర్ లో ఈ రోజు బాంబు పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 5 మంది మరణించినట్లు తెలుస్తోంది. దాదాపుగా 27 మంది వరకు గాయపడ్డారు. భారతీయ వస్తువులను విక్రయించే లాహోర్‌లోని ప్రసిద్ధ అనార్కలి మార్కెట్‌లోని పాన్ మండి సమీపంలోని పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి దుకాణాల సముదాయాలు దెబ్బతిన్నాయి. పేలుళ్లతో జనాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అయితే ఘటనకు ముందుగా తెహ్రిక్ ఇ తాలిబన్ పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ కారణం అని అనుకున్నప్పటికీ… బెలూచ్ నేషనలిస్ట్ ఆర్మీ పేలుడుకు బాధ్యత తమదే అని ప్రకటిచింది.
మోటార్ సైకిల్ లో అమర్చిన టైమ్ కంట్రోల్డ్ బాంబు పేలడంతో ప్రమాదం సంభవించింది. ఘటనలో గాయపడ్డవారిని అధికారులు హుటాహుటిగా స్థానికంగా ఉన్న మేయో హాస్పిటల్ కు తరలించారు. బలూచ్ నేషనలిస్ట్ ఆర్మీ.. పాకిస్థాన్ లోని బలూచిస్తాన్ ప్రావిన్స్ స్వాతంత్య్రం కోసం పోరాడుతోంది.