పావలా శ్యామల ప‌రిస్థితి దారుణం.. తిండిలేక‌, డ‌బ్బుల్లేక‌..

-

తెలుగు ఇండ‌స్ట్రీలో పావ‌లా శ్యామ‌లకు ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ఉంది. త‌న అమాయ‌కపు ఎక్స్‌ప్రెష‌న్ల‌తో చాలామంది అభిమానుల‌ను సంపాదించుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు 250కి పైగా సినిమాల్లో చేసి, అవార్డులు, రివార్డుల‌ను త‌న ఖాతాలో వేసుకుంది. కానీ ఇదంతా గ‌తం. ఇప్పుడామె తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది.

అస‌లే క‌రోనాతో షూటింగులు లేక‌, ప‌నుల్లేక నానా అవ‌స్థ‌లు ప‌డుతోంది. త‌న కూతురికి అనారోగ్య స‌మ‌స్య‌లు ఉండ‌టంతో డ‌బ్బుల‌న్నీ ఆమెకే అయిపోతున్నాయి. తెలంగాణ ప్ర‌భుత్వం ఆమెకు గ‌తంఓ నెల‌కు రూ.10వేల పింఛ‌న్ ఇచ్చేది. కానీ అది ఇప్పుడు స‌రిగా రావ‌ట్లేద‌ని శ్యామ‌ల బాధ‌ప‌డుతోంది.

ఇంటి ఖ‌ర్చులు, అద్దె, అనారోగ్యం, అప్పులు ఆమెను కోలుకోలేని దెబ్బ తీస్తున్నాయి. క‌నీసం తిన‌డానికి తిండి లేక దీనావ‌స్థ‌లో ఉంది. మూడు నెల‌లుగా ఇంటి అద్దె కూడా క‌ట్ట‌లేద‌ని ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేస్తోంది. శ్యామ‌ల క‌ష్టాలు తెలుసుకున్న క‌రాటే క‌ల్యాణి ఆమె ఇంటికి వెళ్లింది. శ్యామ‌ల‌ను ప‌రామ‌ర్శించి, త‌న‌కు తోచినంత సాయం చేసింది. టాలీవుడ్ మా అసోసియేష‌న్ నుంచి కూడా సాయం అందేలా చూస్తాన‌ని క‌ల్యాణీ తెలిపింది. ఆమె ప‌రిస్థితి తెలుసుకున్న వారు సాయం చేయాలంట సోష‌ల్ మీడియాలో కోరుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news