ఆంధ్రప్రదేశ్ లో ఆక్సిజన్ సరఫరా, ఇతరత్రా అంశాలపై డీజీపీ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆక్సిజన్ సరఫరాలో ఇబ్బందులను అధిగమించి పేషెంట్లకు భరోసా కల్పిస్తాం అని పేర్కొంది. ఆక్సిజన్ పై ప్రత్యేక దృష్టిసారించాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు అని ఆక్సిజన్ ట్యాంకర్లకు గ్రీన్ చానెల్ ఏర్పాటు చేస్తామని వివరించారు. ఆక్సిజన్ సరఫరా చేసే 11 ప్లాంట్ల నుంచి మ్యాపింగ్ చేశాం అని అన్నారు.
ఎటువంటి అవరోధాల్లేకుండా రవాణా చర్యలు చేపట్టాం అని తెలిపారు. ఒడిషా, తమిళనాడు, కర్ణాటక డీజీపీలతో ఇప్పటికే సంప్రదింపులు జరిపాం అని అన్నారు. వాళ్లు కూడా పూర్తి సహాయ సహకారాలందిస్తామని తెలిపారు. ఆక్సిజన్ ట్యాంకర్లంన్నింటికీ జీపీఎస్ పెట్టేలా చర్యలు తీసుకున్నాం అని ఆక్సిజన్ ట్యాంకర్లకు రిపేర్లు వంటివి తలెత్తితే తక్షణమే మరమ్మతులు చేయించేందుకు చర్యలు చేపడుతున్నాం అని వివరించారు. ఆక్సిజన్ ట్యాంకర్ల పరిస్థితిని స్టేట్ ఆక్సిజన్ వార్ రూమ్ నుంచి ముగ్గురు ఐపీఎస్ అధికారులు పర్యవేక్షిస్తారు అని అన్నారు.