వీరమల్లు తన వీరత్వం చూపిస్తున్నారట..!!

-

పవన్ కళ్యాణ్ గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు.తన యాక్టింగ్, స్టైల్ తో ఎంతో మంది అభిమానులు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం కొన్ని రోజులు రాజకీయాలలో కొన్ని రోజులు సినిమాలు చేస్తూ వస్తున్నాడు.ఇప్పుడు పవన్ కళ్యాణ్  ”హరిహర వీరమల్లు”. ఈ సినిమా లో నటిస్తున్నారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమా ఎప్పటి నుండో షూటింగ్ జరుపు కుంటూనే వుంది. పవన్ రాజకీయాల వల్ల అడ్డంకి  ఎదురవుతూనే ఉంది. ప్రస్తుతం ఈ షూటింగ్  రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. పవన్ కళ్యాణ్ కూడా సినిమాని తొందరగా పూర్తి చేయాలని పట్టు దలతో వున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ గురించి మంచి అప్డేట్ వచ్చింది.

ప్రస్తుతం సినిమా కోసం యుద్ద సన్నివేశాలు చిత్రీకరణ జరుగుతోందట. దాని కోసం వందలాది మంది జూనియర్ ఆర్టిస్టులతో, గుర్రాలు ఏనుగులు రథాలు తో కోలాహలం మధ్య షూటింగ్ జరుగుతుంది. పవన్ కళ్యాణ్ కూడా వీరుడి గెటప్ లో చాలా ఇంట్రెస్టింగ్ గా యుద్ద సన్ని వేశంలో లో పాల్గొంటున్నారు. ఇప్పటివరకు జరిగిన షూటింగ్ సీన్స్ చూసిన పవన్, డైరక్టర్ క్రిష్ చాలా బాగున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారని సినిమా యూనిట్ వర్గాలు పేర్కొంటున్నాయి.ఈ సినిమా కోసం పవన్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news