మ‌గువ‌ల‌కు షాక్.. మ‌ళ్లీ భారీగా పెరిగిన బంగారం, వెండి ధ‌ర‌లు

-

బంగారం, వెండి కొనుగోలు దారుల‌కు ధ‌ర‌లు మ‌ళ్లీ షాక్ ఇచ్చాయి. గ‌త మూడు రోజుల నుంచి త‌గ్గుతూ వ‌చ్చిన బంగారం, వెండి ధ‌ర‌లు ఈ రోజు కొనుగోలు దార‌కుల‌ను షాక్ కు గురి చేస్తు.. భారీగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లోని హైద‌రాబాద్, విజ‌య‌వాడ న‌గ‌రాల్లో గ‌త మూడు రోజుల్లో ప‌ది గ్రాముల బంగారం పై రూ. 1210 వ‌ర‌కు త‌గ్గింది. కానీ నేడు తాజా గా తెలుగు రాష్ట్రాల్లో.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 150 వ‌ర‌కు పెరిగి రూ. 47,450 కి చేరుకుంది.

అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 160 పెరిగి రూ. 51,760కి చేరుకుంది. అలాగే వెండి ధ‌ర‌లు కూడా గ‌త మూడు రోజ‌ల్లో భారీగా త‌గ్గాయి. గ‌త మూడు రోజుల్లో ఒక కిలో గ్రాము వెండిపై రూ. 2,400 వ‌ర‌కు త‌గ్గింది. కానీ నేడు తాజా గా కిలో గ్రాము వెండిపై రూ. 600 వ‌ర‌కు పెరిగింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌స్తుతం కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 72,900 కు చేరుకుంది.

కాగ ఉక్రెయిన్ – ర‌ష్యా యుద్ధ ప్ర‌భావంతో ఇప్ప‌టికే బంగారం, వెండి ధ‌ర‌లు భారీగా పెరిగాయి. ఈ యుద్ధం త‌ర్వాతే బంగారం ధ‌ర‌లు రూ. 50 వేల మార్క్ ను అందుకున్నాయి. అలాగే వెండి ధ‌ర‌లు రూ. 72 వేల‌ వ‌ర‌కు చేరుకున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news