Breaking : పోలీసులను ఆశ్రయించిన పవిత్ర-నరేశ్‌

-

టాలీవుడ్‌లో పవిత-నరేశ్‌లపై సోషల్‌ మీడియాతో ట్రోలింగ్‌ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పెళ్లిళ్లు అయిన వీళ్లు సహజీవనం చేయడంపై కొన్ని వెబ్‌సైట్లు, యూట్యూబ్‌ ఛానల్స్‌ ట్రోలింగ్‌ చేయడతో వారిపై సైబర్‌ క్రైమ్‌లో ఫిర్యాదు చేశారు. ఈమేరకు సినీ నటులు పవిత్రా లోకేష్, నరేశ్​ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. తమ పట్ల సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫోటోలు మార్ఫింగ్ చేసి వైరల్ చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. తమపై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తమ కంప్లెంయిట్​పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

కాగా, కన్నడ ఇండస్ట్రీలో హీరోయిన్​గా ప్రేక్షకులను అలరించారు పవిత్రా లోకేష్. సెకండ్ ఇన్నింగ్స్​లో కన్నడ, మలయాళం, తెలుగు చిత్రాల్లోనూ క్యారెక్టర్​ ఆర్టిస్ట్​గా నటిస్తూ కేరీర్​లో ఫుల్ బిజీగా ఉన్నారు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఇటీవల కొంతకాలం నుంచి ఆమె నటుడు నరేశ్​తో కలిసి ఉండటం వల్ల హాట్​టాపిక్​గా మారారు. వారిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని, రిలేషన్​షిప్​లో ఉన్నారని ప్రచారం సాగింది. కానీ దీనిపై వారు క్లారిటీ ఇవ్వలేదు కానీ కలిసి మాత్రం తిరుగుతూ కెమెరా కంటికి చిక్కుతున్నారు. ఈ క్రమంలోనే ఓ సారి నరేశ్​ మూడో భార్య వీరి మధ్యలోకి ఎంట్రీ ఇచ్చి గొడవ చేయడం అంతటా చర్చనీయాంశమైంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version