జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యూహాత్మకంగా రాజకీయం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటివరకు పొత్తు పెట్టుకునే దిశగానే రాజకీయం నడిపిన పవన్ సడన్ గా వాయిస్ మార్చేశారు…ఇంకా సింగిల్ గానే సత్తా చాటుతాననే విధంగా మాట్లాడుతూ వస్తున్నారు. ఇంతవరకు అభిమానులే సీఎం సీఎం అవ్వాలని అరుస్తూ వచ్చారు గాని, పవన్ మాత్రం సీఎం అనే పదం పెద్దగా మాట్లాడలేదు. అలాగే వైసీపీ ప్రభుత్వం పోయి మన ప్రభుత్వం రావాలని చెప్పారు గాని…ఎప్పుడు క్లారిటీగా జనసేన ప్రభుత్వం రావాలని చెప్పలేదు.
అంటే పొత్తు ఉంటే టీడీపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు కాబట్టి…మన ప్రభుత్వం అన్నారు తప్ప…జనసేన అని అనలేదు. అలాగే పొత్తు ఉంటే సీఎం ఎవరు ఎవరు అవుతారో క్లారిటీ లేదు కాబట్టి…అది బయటకు చెప్పలేదు. కానీ ఇప్పుడు రెండు క్లారిటీగా చెబుతున్నారు. జగన్ ని గద్దె దించి జనసేన అధికారంలోకి రాబోతుందనే విధంగా మాట్లాడుతున్నారు.
అలాగా ప్రజలు కోరుకుంటే తాను సీఎం అవుతానని చెప్పేస్తున్నారు. పైగా రెండు తెలుగు రాష్ట్రాల్లో జనసేన జెండా ఎగరడం ఖాయమని మాట్లాడారు. పవన్ మాటలు బట్టి చూస్తే సోలోగానే పవన్ ముందుకెళ్తారని తెలుస్తోంది. కానీ ఆయన మాటలు ఎక్కడో తేడా కొట్టేస్తున్నాయి. ఎందుకంటే జనసేన ఎంత పికప్ అయిన ఏపీలో సింగిల్ గా అధికారంలోకి రావడం అనేది జరిగే పని కాదు..నెక్స్ట్ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేంత బలం జనసేనకు రాలేదు.
ఆ విషయం పవన్ కు తెలుసు…అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో జనసేన జెండా ఎగరడం ఖాయమని అంటున్నారు..అసలు ఏపీలోనే అనుకున్నంత బలం లేదని అనుకుంటే తెలంగాణలో ఆ పార్టీకి ఒక్క సీటు కూడా గెలిచే బలం లేదు. కానీ పవన్ ఏదో కన్ఫ్యూజ్ చేయడానికే ఇలా మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చంద్రబాబు-పవన్ కలిసి తనపై కుట్రలు చేస్తున్నారని జగన్ అంటున్నారు.
అంటే వారిని కలిపే శత్రువులుగా చూస్తున్నారు…దీని వల్ల జనసేనని ప్రజలు ప్రత్యేకంగా చూసే అవకాశాలు ఉండవు. ఎలాగో పొత్తు ఉంటుంది కాబట్టి..టీడీపీ, జనసేన ఒకటే అనుకుంటారు. దీంతో జనసేన బలం పెరగదు. అలాగే పొత్తు గురించి ఇప్పుడే చర్చ రాకుండా డైవర్ట్ చేయడానికి పవన్ ఇలా సోలోగా ఉన్నట్లు రాజకీయం నడుపుతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎలాగైనా నెక్స్ట్ చంద్రబాబుతో కలుస్తారని, కానీ అది ఇప్పుడు బయటపడకూడదని చెప్పి పవన్ ఇలా కొత్త స్ట్రాటజీతో వెళుతున్నారని అంటున్నారు. మొత్తానికైతే పవన్ వ్యూహాలు కన్ఫ్యూజ్ గానే ఉన్నాయి.