గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియా వేదికగా పవన్ వ్యక్తిగత జీవితం గురించి ఒక వార్త హల్ చల్ చేస్తోంది. పవన్ కళ్యాణ్ తన మూడవ భార్య అన్నా లేజ్నివో తో కలిసి ఉండడం లేదని త్వరలోనే విడాకులు తీసుకోనున్నారని వార్తలు వచ్చాయి. ఇటీవల పవన్ చేసిన వారాహి యాగానికి రాకపోవడం మరియు వరుణ్ తేజ్ నిశ్చితార్దానికి కూడా హాజరు కాకపోవడమే కారణాలు అని చెబుతున్నాయి మీడియా సంస్థలు. కానీ ఈ వార్తలు అన్నీ అవాస్తవం అని జనసేన నేతలు మరియు పవన్ కళ్యాణ్ అభిమానులు కొట్టిపారేస్తున్నారు. వారిద్దరూ కలిసే ఉన్నారని.. అయితే రాజకీయంగా పవన్ కొంచెం బిజీ గా ఉండడం వలన దూరంగా ఉన్నారని చెప్పుకొచ్చారు.