ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ తుఫాను గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉన్న 175 సీట్లకుగాను 151 సీట్లు గెలుచుకుని తనకి ఈ రాష్ట్రంలో అసలు ఎదురు లేదని నిరూపించాడు. అయితే ఇప్పుడు రాబోతున్న పంచాయతీ ఎన్నికల పైనే పవన్ కళ్యాణ్ మరియు చంద్రబాబు ఇద్దరూ భారీ ఆశలు పెట్టుకున్నారు. తన పురోగతి కోసం పాటు పడుతున్న చంద్రబాబు ఎలాగైనా పంచాయతీ ఎన్నికల్లో తన సత్తా ఏమిటో నిరూపించుకోవాలని తహతహలాడుతుండగా పవన్ కళ్యాణ్ అయితే తాను కూడా రాష్ట్రంలో ఒకడిని ఉన్నానంటూ జనాలు గుర్తించేందుకు ఇది ఒక మంచి అవకాశంగా భావిస్తున్నాడు.
అయితే జగన్ ఏమి అంత ఏమరుపాటుతో అయితే లేడు. నిన్న హైకోర్టు పంచాయతీ ఎన్నికలకు సరే అనగా జగన్ నేడు రాష్ట్రవ్యాప్తంగా అట్టహాసంగా ‘అమ్మ ఒడి’ పథకాన్ని లాంచ్ చేశాడు. అలాగే సరిగ్గా ఇదే సమయంలో ఉద్యోగాలను వదలడం మరియు రాజధానుల విషయమై ఒక కమిటీ నిర్వహించి రాయలసీమ మరియు ఉత్తరాంధ్ర ప్రజలని సంతృప్తి పరిచేలా నిర్ణయాలు బయటకు వెలువరిచడం వంటివి ఎన్నో జిమ్మిక్కులు చేస్తూనే ఉన్నాడు.
వీలైనంత త్వరగా కుదురుకొని ఈ ఎన్నికల్లో జగన్ కు సరైన పోటీ ఇవ్వకపోతే వచ్చే నాలుగేళ్ళు అసలు వారిద్దరు హ్యాపీగా కాలు మీద కాలు వేసుకుని కూర్చోవచ్చు. కనీసం కొన్ని సీట్లు అయినా వస్తే వచ్చే ఎన్నికల మీద ఆశాభావంతో అవసరమైన ప్రక్రియను ఇప్పటినుంచే సిద్ధం చేసుకోవచ్చు.