పవన్ కళ్యాణ్ వృద్ధ నారి ప్రతివతలా కబుర్లు చెబుతున్నాడు : ముద్రగడ

-

పిఠాపురం పాలిటిక్స్ హీట్ రేపుతున్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత, మాజీ ముద్రగడ పద్మనాభం మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాకినాడ జిల్లా కిర్లంపూడిలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ వృద్ధ నారి ప్రతివతలా కబుర్లు చెప్తున్నారని విరుచుకుపడ్డారు. పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతపై పవన్ చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

మెగా కుటుంబంలో ఒక అమ్మాయి నాయీ బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన హీరోని ప్రేమించిందని.. అతడిని ఆత్మహత్య చేసుకునేలా చేశారు. వంగ గీత కాపు కాదా..? నువ్వేనా కాపు? నువ్వు కచ్చితమైన కాపు అయితే నీ చరిత్ర బయట పెట్టు. నేను కచ్చితమైన కాపును.. కల్తీ కాపుల గురించి ప్రజలకు తెలియాలి. నీ ముగ్గురు భార్యలకు వైసీపీ తరఫున టికెట్ కావాలంటే ఇప్పిస్తాను. నా కూతురు, నేను దుష్టుల వల్ల దూరం అయ్యాం. వచ్చే జన్మలో కలుద్దాం అని ముద్రగడ పద్మనాభం వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news