ఇటీవలి తుఫాను కారణంగా కురిసిన భారీ వర్షాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీగా పంట నష్టం వాటిల్లిందన్న విషయం తెలిసిందే ఈ క్రమంలోనే ప్రభుత్వం శరవేగంగా చర్యలు తీసుకుని రైతులకు నష్టపరిహారం చెల్లించాలని ప్రతిపక్షాలు ప్రస్తుతం రైతులకు అండగా నిలబడి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ఇటీవలే పంట నష్టపోయిన రైతుల అందరినీ పరామర్శిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాలలో పర్యటన చేస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఇక ఇటీవలే రైతులను పరామర్శించడానికి వెళ్ళిన పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
తుఫాన్ కారణంగా పంట నష్టపోయి ప్రస్తుతం అయోమయం లో పడిపోయిన రైతులకు 35 వేల పరిహారాన్ని ప్రభుత్వం చెల్లించాలి అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. ఇటీవల తిరుపతిలో పర్యటించిన ఆయన దేశానికి అన్నం పెట్టే రైతన్న కష్టాలను తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది అంటూ వ్యాఖ్యానించారు. అన్నదాతల కోసం జైకిసాన్ పేరుతో ఓ కార్యక్రమాన్ని త్వరలో నిర్వహిస్తామంటూ తెలిపిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. రైతులకు గిట్టుబాటు ధర అవసరం లేదని లాభసాటి ధర కావాలి అంటూ డిమాండ్ చేశారు.