కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై పంజాబ్ రైతులందరూ తీవ్రస్థాయిలో ఉద్యమం చేపడుతున్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పటికే భారీగా చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టడం తో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి అయితే ఇటీవలే రైతులందరూ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేపడుతున్న ఉద్యమంపై మాట్లాడిన పంజాబ్ ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు,
వ్యవసాయ చట్టాల పై రైతుల అభ్యంతరాలతో పాటు తన వ్యతిరేకతను కూడా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లాను అంటూ చెప్పుకొచ్చారు పంజాబ్ ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్. ఇక రైతులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించడం తన చేతుల్లో లేదు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రైతుల సమస్యలను పరిష్కరించే విధంగా కేంద్ర ప్రభుత్వం త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవాలి అంటూ కోరారు పంజాబ్ ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి రైతులకు జరుగుతున్న చర్చలు విజయవంతమై సమస్య సద్దుమణిగింది అని ఆకాంక్షించారు ఆయన.