రజనీ కాంత్ రాజకీయాల్లోకి రావడంపై చంద్రబాబు రియాక్షన్…!

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సూపర్ స్టార్ రజనీ కాంత్ రాజకీయ రంగ ప్రవేశంపై కీలక వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రం ఆర్ధిక పరిస్థితి ఆందోళనకరంగా మారింది అన్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని గాడిలో పెట్టాలని కేంద్ర మాజీ మంత్రి సురేష్ ప్రభు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామనుకు లేఖ రాశారు అని పేర్కొన్నారు. కొందరు పోలీసులు రెచ్చిపోతున్నారు అని ఆయన విమర్శించారు.

తప్పులు చేసే పోలీసులు ఎప్పటికైనా శిక్ష అనుభవించక తప్పదన్నారు. అబ్దుల్ సలాం ఘటనలో పోలీసులు జైళ్లకు వెళ్లారు అని ఆయన మండిపడ్డారు. జమిలీ ఎన్నికలొస్తే ఈ ప్రభుత్వం ఉండదు అన్నారు. రజనీ కాంత్ నాకు మంచి ఫ్రెండ్ అని చంద్రబాబు చెప్పుకొచ్చారు. రజనీ కాంత్ రాజకీయాల్లోకి రావడం మంచిదే అన్నారు. రజనీకాంత్ ప్రకటనను స్వాగతిస్తున్నా అన్నారు చంద్రబాబు. ప్రజాస్వామ్యంలో పార్టీలు రావడం సహజమే అని చెప్పుకొచ్చారు.