రాజకీయాల్లో తొలి విజయం అనేది ఎప్పుడు గొప్పగానే ఉంటుంది..అలాంటి గొప్ప అనుభూతిని పొందడానికి ప్రతి నాయకుడు తహతహలాడుతూనే ఉంటారు…తొలి విజయం అందుకోవడం కోసం ఆతృతగా ఎదురుచూస్తారు. అయితే అలాంటి తొలి విజయం కోసం జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎదురు చూస్తున్నారనే చెప్పొచ్చు. పైకి గెలుపోటములని పట్టించుకోమని చెబుతున్నా సరే…పవన్ కు గెలుపుపై చాలా ఆశలు ఉన్నాయని చెప్పొచ్చు. అలాగే ఆయన అభిమానులు కూడా బాగా ఆతృతగా ఉన్నారు.
అయితే గత ఎన్నికల్లో పవన్ కు తొలి విజయం దక్కలేదనే సంగతి తెలిసిందే. రెండు చోట్ల పోటీ చేసిన సరే పవన్ కల్యాణ్ కు గెలుపు దక్కలేదు. గాజువాక, భీమవరంల్లో పవన్ ఓటమి పాలయ్యారు. జగన్ వేవ్ లో ఓడిపోవాల్సి వచ్చింది. ఇలా రెండుచోట్ల ఓడిపోయినంత మాత్రాన పవన్ కల్యాణ్ కు బలం లేదని అనుకోవడం పొరపాటే అవుతుంది..ఎందుకంటే ఆయనకు కనిపించని బలం ఉంది..కాకపోతే ఆ బలం ఇంకా పెంచుకోవాల్సిన అవసరం ఉంది.
మరి 2019 ఎన్నికల తర్వాత అలా బలం పెంచుకునే ప్రయత్నాలు చేశారా? అంటే కాస్త చేసినట్లే కనిపిస్తున్నారు గాని..బలం మాత్రం పెద్దగా పెరిగినట్లు కనిపించలేదు. అధికార వైసీపీ బలం తగ్గుతుంటే..ప్రతిపక్ష టీడీపీ బలం కాస్త పెరుగుతూ వస్తుంది తప్ప..మధ్యలో జనసేన బలం ఎఫెక్టివ్ గా పెరిగినట్లు కనిపించడం లేదు. మరి ఇలాంటి పరిస్తితుల్లో పవన్ మళ్ళీ ఎన్నికల బరిలో దిగితే గెలుస్తారా? అంటే.. ఈ సారి పవన్ కు గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.
బయట సమస్యలని గళం విప్పుతున్నా పవన్ లాంటి నాయకుడు అసెంబ్లీలో ఉంటే బాగుంటుందని జనం భావిస్తున్నారు..కాబట్టి ఈ సారి పవన్ కు తొలి విజయం దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదే సమయంలో పవన్ గాని టీడీపీతో కలిస్తే..తొలి విజయం దక్కడంలో ఎలాంటి డౌట్ ఉండదని తెలుస్తోంది..అలాగే జనసేనకు అడ్వాంటేజ్ అవుతుందని చెప్పొచ్చు..అందుకే పవన్..టీడీపీతో పొత్తు పెట్టుకుని ముందుకెళ్లెలా ఉన్నారు..ఈ విషయంలో పవన్ కాస్త ఫిక్స్ అయినట్లే కనిపిస్తున్నారు. మరి చూడాలి పవన్ తొలి విజయం ఏ రేంజ్ లో ఉంటుందో.