తమ్ముడు సినిమా చూసే ఉంటారు కదా… అందులో హీరోగారైన పవన్ కళ్యాణ్ లేనిది ఉన్నట్లు బిల్డప్లు ఇస్తూ అన్ని వచ్చిరాని కుళ్ళు జోకులు వేస్తూ ఉంటాడు.. అప్పుడు అచ్చు పవనాలు పరిస్థితి కూడా తమ్ముడు సినిమా లాగే అయింది.. ఇంతకు జనసేనాని ఎందుకు ఇలా తయారయ్యాడు.. సినిమాల్లో పవనిజం అంటూ హీరోయిజం చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజకీయ కామెడియన్‌గా మారాడేంటబ్బా అనుకుంటున్నారు ఏపీ ప్రజలు. అసలు పవన్ కళ్యాణ్‌కు తిక్కుందా… అసలు దానికేమైనా లెక్కుందా… అందుకే రాజధాని పేరుతో చేసిన నానాయాగిని చూస్తే పవన్ కళ్యాణ్‌కు అసలు హీరోయిజానికి తక్కువ… కమెడియన్‌కు ఎక్కువగా ఉంది పరిస్థితి చూస్తుంటే..
సినిమాల్లో పవన్ కళ్యాణ్ పవర్‌స్టార్… రాజకీయాల్లో మాత్రం పవర్‌లెస్‌స్టార్ అని ఇప్పుడు జోరుగా ప్రచారం జరుగుతుంది. పవన్‌కళ్యాణ్ ఏపీలో జనసేన పార్టీని స్థాపించి 2014 ఎన్నికల్లో పోటీ చేయకుండా కేవలం టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చాడు. అప్పుడు ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. టీడీపీ రాష్ట్రంలో, బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రావడానికి నా సపోర్టు కారణమంటూ ఏన్నోసార్లు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చాడు పవన్ కళ్యాణ్. తరువాత ఏమైంది టీడీపీ, బీజేపీకి దూరం జరిగినట్లే జరిగిండు.
ఏపీకి ప్రత్యేక హోదా పేరుతో ఉద్యమిస్తున్నానని చెప్పి పోరాటం చేసిండు.. అంతా సినిమా క్రిటిక్ మాదిరిగానే ఉద్యమించిన పవన్‌కు కమ్యూనిస్టులు జత కలువడంతో కొంత మేరకు ప్రత్యేక హోదాపై చిత్తశుద్ది ఉందని ప్రజలు గ్రహించారు.. కానీ ఈ ఉద్యమాన్ని మద్యలోనే వదిలేసాడు పవనాలు.. ఇక 2019 ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సొంతంగానే ఏపీలో పోటీ చేశాడు జనసేనాని. వామపక్షాలు, బీఎస్పీతో పొత్తుపెట్టుకుని బ్లాక్‌బ్లస్టర్ సాధిస్తానని ప్రగాల్బాలు పలికి, చివరికి అజ్ఞాతవాసిలా అజ్ఞాతంలో కలిసిపోయాడు. పోటీ చేసిన రెండుచోట్ల ఓడిపోయి పవన్ కళ్యాణ్ రాజకీయ సన్యాసం స్వీకరిస్తాడనుకునే సరికి కమెడియన్ వేషం వేసి మళ్ళా రాజధాని పేరుతో ఏపీలో దిగాడు.
రాజధాని కోసం ఇన్ని వేల ఎకరాలు అవసరమా.. ఇందులో మోసం జరిగింది అని ఆనాడు చంద్రబాబు నాయుడును విమర్శించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు అమరావతిలోనే రాజదాని కట్టాలి… లేకుంటే పోరాటం చేస్తాం… నేను వస్తున్నానే భయంతోనే రైతులుకు కౌలు నిధులు విడుదల చేశారు… నేను పెద్ద తోపును… అంటూ వీరావేశానికి పోయాడు పవన్ కళ్యాణ్. అంటే పవన్ కళ్యాణ్ ఏ రోటి కాడి పాట ఆ రోటి కాడే పాడుతాడనే తెలిసిపోతుంది. అయితే ఎన్నికల ముందు ప్రత్యేక హోదా స్టంట్లు చేసి, ఎన్నికల్లో బొక్కబోర్లా పడి తలబొప్పి కట్టించుకున్న పవనాలు.. ఇప్పుడు ఏపీకి రాజధాని అమరావతే అంటూ.. అక్కడ రాజధాని నిర్మాణం చేయకుంటే నేను మోడి, అమిత్ షాలను కలుస్తానని, వారిద్దరు నాకు బాగా తెలుసని జోక్‌ల మీద జోక్‌లు పేల్చాడు.
రాజధానిలో నిర్మాణాలు ఆగిపోవడంతో భవన నిర్మాణ కార్మికుల బతుకులు ఆగిపోయాయని పంచ్ డైలాగ్ విసిరాడు.. అంతే కాదు… బోత్స సత్యనారాయణ నాకు బాగా తెలుసు… ఆయన ఆలోచించుకోవాలి… ఆయన కూడా సీఏం అయ్యే అవకాశాలు ఉన్నాయని ఓ కుళ్లు జోక్ వేశాడు… ఇక్కడ ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే ఏపీ కి ప్రత్యేక హోదా సాధించే వరకు పోరాటం చేస్తానన్న పవనాలు ఎన్నికలు ముగియగానే ప్రత్యేక హోదాను మరిచిపోయారు.
ఇక ఇప్పుడు రాజధాని కోసం ఎంతకైనా పోరాటం చేస్తానంటూ యాగి చేస్తున్నాడు.. ఇది కూడా మరో వారం రోజులు గడిచిపోతే రాజదాని విషయం మరిచిపోవడం ఖాయం. ఇలా పవనాలు అన్ని గాలి కబుర్లు చెప్పడం, వాటిని మరిచిపోవడం, తిరిగి మళ్ళీ రావడం మళ్ళీ ఇది చేస్తా.. అది చేస్తా అనడం చూస్తుంటే ఒకటి గుర్తుకొస్తుంది.. పవనాలు సినిమాల్లో కాటమ రాయుడు… కానీ రాజకీయాల్లో మాత్రం తుపాకి రాముడే.