కేసీఆర్‌ ఒప్పుకుంటే.. నిధులు తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటా : బండి సంజయ్

-

ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం ఎంతమంది దరఖాస్తు చేశారు? ఎంతమందికి ఇండ్లు కేటాయించారో వివరాలు ప్రకటించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు 2.5 లక్షల ఇండ్లు మంజూరు చేస్తే, కెసిఆర్ ప్రభుత్వం అన్నీ నిర్మించినట్లుగా లెక్కలు చూపిందని, అధికారులను నిలదీస్తే ఏడు వేల మందికే ఇండ్లను కేటాయించినట్లు తేల్చారన్నారు. పేదలకు ఇండ్లు దక్కకుండా వారి నోట్లో మట్టి కొడుతున్నారని బండి సంజయ్ ధ్వజమెత్తారు.

రాష్ట్ర ప్రభుత్వం కోరితే కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున ఇండ్ల నిర్మాణానికి నిధులు తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటానని చెప్పారు బండి సంజయ్. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరుద్యోగ మార్చ్ ప్రారంభమయ్యింది. అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించిన బండి సంజయ్ ర్యాలీలో పాల్గొన్నారు. పోతరెడ్డిపల్లి చౌరస్తానుంచి కలెక్టరేట్ వరకు ఈ మార్చ్ సాగనుంది. కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన సభలో బండి సంజయ్ మాట్లాడతారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version