కొద్ది రోజులుగా జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి టార్గెట్‌గా తీవ్రంగా విరుచుకు పడుతోన్న సంగతి తెలిసిందే. తాజాగా గురువారం పవన్ చిత్తూరు జిల్లా మదనపల్లెలోని మార్కెట్ యార్డును సందర్శించారు. మార్కెట్‌లోని టమాటా రైతులతో ఏర్పాటు చేసిన ముఖాముఖీ సమావేశంలో పవన్ జగన్‌పై తీవ్రంగా విరుచుకుపడ్డాడు. తాను రైతు కష్టం తెలిసిన వాడినే అని… టమోటా పంట చేతికి రావాలంటే డెబ్బై రోజులు కష్టపడాలి… ఒక ట్రే టమోటా పండించాలంటే 450 రూపాయల ఖర్చవుతుంది.. టమాటా రైతుకు పరిహారం చెల్లించే వరకు జనసేన పోరాటం చేస్తుందని పవన్ తెలిపారు.
ఈ క్రమంలోనే పవన్ జగన్‌పై తీవ్రంగా విరుచుకు పడ్డారు. రైతులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం ఇళ్లు కూల్చడం పై శ్రద్ద పెడుతోంది… రైతుల కష్టాలు పట్టించుకోకపోతే 151 మంది ఎమ్మెల్యేలను పొలంలో దున్నేస్తారు… ఈ ఆరునెలల్లో.. జగన్ చేసింది.. మాజీ ముఖ్యమంత్రి ఇల్లు కూలుద్దాం.. లేదా.. పోలవరం కాంట్రాక్టులు రద్దు చేయడం మాత్రమే చేశారని విమర్శించారు. ఇక తాను రైతులను కలుస్తానంటే కూడా జగన్ తనను ఆపాలని చూశారని పవన్ దుయ్యబట్టారు.
మత మార్పిడులు మీద సీఎంకు.. ఉండే దృష్టి.. రైతుల సమస్యల మీద లేదా అంటూ ప్రశ్నించారు. ఓ వైపు గిట్టుబాట ధర లేక రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు… నా తరపున రైతులకు గిట్టుబాటు ధర దక్కే వరకు పోరాటం చేస్తానని పవన్ హామీ ఇచ్చారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో టమాట రైతుల సమస్యనున పరిష్కరించాలని పవన్.. ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.