Pawan Kalyan : ‘హరిహర వీరమల్లు’ కంటే ముందే ‘వినోదయ సితం’

-

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వరుస సినిమాలతో బిజీబిజీగా ఉన్నారు. మరోవైపు ఎన్నికలు దగ్గరపడుతుండటంతో త్వరగా తన చేతిలో ఉన్న సినిమాల షూటింగ్ పూర్తి చేసే పనిలో పడ్డారు. ఇప్పటికే ‘హరిహర వీరమల్లు’ షూటింగ్​లో పాల్గొంటున్నారు. క్రిష్ దర్శకత్వంతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.

ఇదే కాకుండా పవన్ కల్యాణ్ తమిళ్ మూవీ.. వినోదయ సితం’ రీమేక్​లో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీకి పి. సముద్రఖని దర్వకత్వం వహించనున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే..?

వినోదయ సితం సినిమాను హరిహర వీరమల్లు కంటే ముందే రిలీజ్‌ చేయాలని మేకర్స్‌ ప్లాన్ చేస్తున్నారట. హరిహర వీరమల్లును ముందుగా ఏప్రిల్‌లో అనుకున్నా.. షూటింగ్‌ ఇంకా బ్యాలెన్స్‌ ఉండటంతో దసరాకు ప్లాన్‌ చేస్తున్నారట. ఈ గ్యాప్‌లో వినోదయ సితం రీమేక్‌ను పూర్తి చేసి సమ్మర్‌లో రిలీజ్‌ చేయాలనే ప్లాన్​లో ఉన్నారట మేకర్స్.

Read more RELATED
Recommended to you

Exit mobile version